మహిళల ఆర్థికాభివృద్ధికే చేయూత : ఎమ్మెల్యే

Mar 13,2024 21:50

ప్రజాశక్తి – కొమరాడ : వైఎస్సార్‌ చేయూత పథకం ద్వారా అందజేస్తున్న పెట్టుబడి సొమ్ముతో మహిళలు సొంతంగా పరిశ్రమలు ఏర్పాటు చేసుకుని పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలని కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్ప శ్రీవాణి అన్నారు. బుధవారం స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో వైఎస్‌ఆర్‌ చేయూత నాలుగో విడత 4611 మంది సభ్యులు రూ .8.65 కోట్లు నమూనా చెక్కును ఎమ్మెల్యే మహిళలకు పంపిణీ చేశారు. 2019 ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్రెడ్డి సంక్షేమ పథకాల రూపంలో నేరవేర్చరన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అన్ని వర్గాల పేదింటి అక్క చెల్లెమ్మల కోసం దాదాపు 32 పథకాలను అమలు చేస్తున్నారన్నారు. అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పథ కాలు అమలు చేస్తున్నారన్నారు. అనంతరం సిఎం జగన్మో హన్రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో ఎంపిపి శెట్టి శ్యామల, జడ్పీటీసీ ద్వారపురెడ్డి లక్ష్మి, డిఆర్‌డిఎ ఇన్చార్జి పిడి వై. సత్యం నాయుడు, ఎంపిడిఒ ఎం.మల్లికార్జునరావు, ఎపిఎం వెంకటరమణ, వైస్‌ ఎంపిపిలు శరత్‌బాబు, అన్నపూర్ణ, కొమరాడ పిఎసిఎస్‌ అధ్యక్షులు సురాపు నాయుడు, సివిని అధ్యక్షులు గోపాలకష్ణ, వైసీపీ మండల కన్వీనర్‌ ద్వారపురెడ్డి జనార్ధన్‌, సీనియర్‌ నాయకులు శెట్టి మధుసూదన్‌ రావు, సింహాచలం నాయుడు, మల్లిబాబు, పలువురు ఎంపిటిసిలు, సర్పంచులు మహిళలు వెలుగు సిబ్బంది పాల్గొన్నారు.రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యేప్రతి మారుమూల గిరిజన గ్రామాలకు రహదారి సదుపాయం కల్పించడమే ధ్యేయంగా ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే పాముల పుష్ప శ్రీవాణి అన్నారు. కొమరాడ నుంచి అంటివలస, మసిమండ నుంచి లంజి గ్రామం వరకు రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం కూనేరు నుంచి మసిమండ రోడ్డును ప్రారంభించారు. ఈ సందర్భంగా పుష్ప శ్రీవాణి మాట్లాడుతూ గత కొన్నేళ్లు ఈ రహదారి పూర్తిగా మరమ్మతులకు గురవడంతో ప్రజలు పడుతున్న ఇబ్బందులు తెలిసినప్పటికీ నిధులు కొరతతో ఇన్ని రోజులు జరగలేదని అన్నారు. కాంట్రాక్టర్లు కూడా పనులు చేసేందుకు ముందుకు రాకపోవడంతో రోడ్డు పనులు ఆలస్యంగా ప్రారంభమయ్యాయని తెలిపారు. అధికారులు సక్రమంగా నాణ్యతా లోపాలు లేకుండా రహదారి పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ రహదారి పనుల కోసం ఎప్పటి నుంచే గిరిజనులు ఆశగా ఎదురుచూస్తున్నారన్నారు. పనులు త్వరితగతిన ప్రారంభించి వేగంగా పూర్తి చేయాలని తెలిపారు. కార్యక్రమంలో ఐటిడిఎ ఇఇ శాంతీశ్వరరావు, డిఇ ఎంపిపి శెట్టి శ్యామల, జడ్పిటిసి ద్వారపురెడ్డి లక్ష్మి, దేవుకోన సర్పంచ్‌ శ్రీరామవిజయ, నాయకులు, సర్పంచులు, ఎంపిటిసిలు, వైసిపి కన్వీనర్‌ ద్వారపురెడ్డి జనార్ధన్‌, నాయకులు మధుసూదన్‌రావు, వైస్‌ ఎంపిపి ఎన్‌.శరత్‌బాబు, వైసిపి నాయకులు , కార్యకర్తలు పాల్గొన్నారు.భామిని : మహిళలకు వైఎస్‌ ఆర్‌ చేయూత అందించి, తద్వారా వారికి ఆర్థిక స్థితిగతులు మెరుగుపర్చడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే వి.కళావతి అన్నారు. బుధవారం స్థానిక మండల పరిషత్‌ కార్యాలయ ఆవరణలో ఎపిఎం దొడ్ల భవానీ, ఎంపిడిఒ ఆర్‌.కిషోర్‌కుమార్‌ ఆధ్వర్యంలో వైఎస్‌ఆర్‌ చేయూత నాలుగో విడత పంపిణీ కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మండలంలోని 3482 మహిళలకు రూ.6 కోట్ల 52 లక్షలు 4 విడత వై ఎస్‌ ఆర్‌ చేయూత చెక్కును అందజేశారు. అనంతరం మూలగూడలో రూ.30 లక్షలతో నిర్మించిన సిసి రోడ్డును ప్రారంభించారు. పసుకుడి జలజీవన్‌లో భాగంగా పూర్తి చేసిన మంచి నీటి కుళాయిలను ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపిపి ప్రతినిధి తోట సింహా చలం, వైస్‌ ఎంపిపి బోనగడ్డి ధర్మారావు, జెసిఎస్‌ కో-ఆర్డినేటర్‌ కొత్తకోట చంద్రశేఖర్‌, జెడ్‌పిటిసి బొడ్డేపల్లి చిన్నమ్మి, ప్రజాప్రతినిధులు బిడ్డిక తమ్మారావు, భార్గవ్‌నాయుడు, గెల్లంకి రమేష్‌, కొండగొర్రి మంగ, సరిసభద్ర, దాలయ్య పాల్గొన్నారు.బిటి రోడ్ల పనులు పూర్తి చేసేదెప్పుడు? : సిపిఎం కొమరాడ : గిరిజన గ్రామాల రహదారులకు శంకుస్థాపన చేసి మట్టేసి వదిలేయడమేనా? రోడ్లు పూర్తి చేసేది ఎప్పుడని సిపిఎం నాయకులు కొల్లి సాంబమూర్తి ప్రశ్నించారు. మండలంలోని పెద్దశాఖలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. నాలుగు నెలల క్రితం కురుపాం ఎమ్మెల్యేగా మండలంలోని కోనవలస నుండి బొడ్డవలస, బొడ్డవలస నుంచి నందాపురం, నందాపురం నుంచి తమన్నదొర వలస, తమన్న దొరవలస నుంచి డంగభద్ర, కోనవలస సెంటర్‌ నుండి లక్షింపేట, కంచరపాడు, విక్రాంపురం, కోనలి, అంకులవలస, సుందరపురం కుమ్మరకుంట జంక్షన్‌, శివిని, కురింపేట తదితర గిరిజన గ్రామాలకు బీటీ రోడ్డు వేస్తామని చెప్పి జెసిబితో రోడ్డుకి ఇరువైపులా తవ్వేశారు కానీ రోడ్డుకు సంబంధించిన సామాగ్రిని వేయని పరిస్థితి నెలకొందన్నారు. ఇలాంటి సందర్భంలో మళ్లీ బుధవారం కొమరాడ నుండి అంటి వలస గ్రామానికి కూడా బీటీ రోడు వేస్తామని శంకుస్థాపన చేస్తున్నారు తప్ప ఇలా ఈ శంకుస్థాపనలు పైన తెలిపిన గిరిజన గ్రామాల రోడ్లు గాను పూర్తిస్థాయిలో నిధులు విడుదల చేసి కాంట్రాక్టుకు పూర్తిగా బకాయి చెల్లించి పెండింగ్‌ పనులు వేగవంతం చేయాలని సందర్భంగా కోరారు. అలాగే పోడు భూములు గిరిజన రైతులు ఎంత సాగు చేస్తే అంత భూమికి పట్టాలివ్వాలని డిమాండ్‌ చేశారు. విలేకరుల సమావేశంలో గిరిజన సంఘం నాయకులు మధు, కైలాస్‌, గిరిజన నాయకులు పాల్గొన్నారు.

➡️