మాగుంట సుబ్బరామరెడ్డి వర్థంతి ఏర్పాట్ల పరిశీలన

ప్రజాశక్తి – ఒంగోలు కలెక్టరేట్‌ ఒంగోలు మాజీ పార్లమెంట్‌ సభ్యులు దివంగత మాగుంట సుబ్బరామరెడ్డి 28వ వర్థంతి సందర్భంగా డిసెంబర్‌ 1న ఒంగోలు పివిఆర్‌ బాలుర ఉన్నత పాఠశాలలో సంస్మరణ సభ, అన్నదానం, ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించనున్నారు. అందులో భాగంగా ఏర్పాట్లను లక్ష్మినారాయణ రెడ్డి ఆధ్వర్యంలో మాగుంట అభిమానులు మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా లక్ష్మినారాయణ రెడ్డి మాట్లాడుతూ మాగుంట సుబ్బరామరెడ్డి వర్ధంతి సందర్భంగా సంస్మరణ సభ, అన్నదానం , ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మెగా వైద్య శిబిరంలో అనుభవజ్ఞులైన వైద్యులు డాక్టర్‌ ఎల్‌.రిచర్డ్స్‌(జనరల్‌ మెడిసిన్‌), డాక్టర్‌ అమర్‌నాథ్‌ రెడ్డి(ఆర్థోపెడిక్‌), డాక్టర్‌ నితిన్‌ నల్లూరి(జనరల్‌ సర్జన్‌), డాక్టర్‌ రమణారెడ్డి(అప్తమాలజీ), డాక్టర్‌ కల్యాణ్‌(ఇఎన్‌టి), డాక్టర్‌ ప్రశాంతి(గైనకాలజిస్ట్‌), డాక్టర్‌ కల్యాణ్‌(డెంటల్‌), డాక్టర్‌ నిశ్చల్‌ రెడ్డి(న్యూరాలజిస్ట్‌) పాల్గొంటారన్నారు. సంస్మరణ సభ, అన్నదానం, ఉచిత మెగా వైద్య శిబిరంలో జిల్లాలోని ప్రజలు, మాగుంట అభిమానులు పాల్గొని జయప్రదం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఎఎంసి మాజీ చైర్మన్‌ అయినాబత్తిన ఘనశ్యామ్‌, తాతా ప్రసాద్‌, కుప్పా రంగనాయకులు, ఆత్మకూరి బ్రహ్మయ్య, పసుపులేటి శ్రీనివాసరావు, షేక్‌ అన్వర్‌ బాషా పాల్గొన్నారు.

➡️