‘మాగుంట’ సేవలు చిరస్మరణీయం

Nov 26,2023 20:28
సుబ్బరామిరెడ్డికి నివాళులర్పిస్తున్న దృశ్యం

సుబ్బరామిరెడ్డికి నివాళులర్పిస్తున్న దృశ్యం
‘మాగుంట’ సేవలు చిరస్మరణీయం
ప్రజాశక్తి-కందుకూరు : ఒంగోలు మాజీ ఎంపి మాగుంట సుబ్బరామరెడ్డి జయంతి కార్యక్రమం కందుకూరు పట్టణ వైసిపి యువ నాయకులు రహీం ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా రహీం మాట్లాడుతూ సుబ్బరామ రెడ్డి పార్టీలకు అతీతంగా ఎన్నో కుటుంబాలకు అండగా నిలిచి ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారని కొనియాడారు. అనంతరం ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. కరీముల్లా, జాకీర్‌, డాక్టర్‌ రారు, అమ్మనబ్రోలు రహీం, నయీమ్‌ భాష పాల్గొన్నారు.

➡️