మాజీ ఎమ్మెల్యే ‘ఉగ్ర’ జన్మదిన వేడుకలు

ప్రజాశక్తి-సిఎస్‌.పురం : మాజీ ఎమ్మెల్యే, టిడిపి కనిగిరి నియోజకవర్గ ఇన్‌ఛార్జి డాక్టర్‌ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి జన్మదిన వేడుకలను టిడిపి నాయకులు గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక టిడిపి కార్యాలయంలో కేక్‌ కటింగ్‌ చేసి కార్యకర్తలకు పంచిపెట్టారు. బెంగళూరులో టిడిపి నాయకుడు మన్నేపల్లి కార్తీక్‌ ఆధ్వర్యంలో ఉగ్ర నరసింహారెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు. అనంతరం కేక్‌ కట్‌ చేసి పంచిపెట్టారు. ఈ సందర్భంగా పేదలకు అన్నదానం నిర్వహించారు. సిఎస్‌.పురంలో టిడిపి కార్యకర్తలు. ఉగ్ర అభిమానులు ఉగ్ర జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షుడు బొమ్మనబోయిన వెంగయ్య, సిఎస్‌పురం సర్పంచి శ్రీరాం పద్మావతి, టిడిపి సీనియర్‌ నాయకులు నాగిశెట్టి చిన్నమాలకొండయ్య, తోడేటి పెద్ద అల్లూరయ్య, రామకష్ణంరాజు, పోకల మాల్యాద్రి, మహబూబ్‌ బాషా, దాసరి మల్లికార్జున, పాములపాటి నరసయ్య, వెంకటాద్రి, సంగిశెట్టి వెంకటేశ్వర్లు, కోనంగి వెంకటకొండయ్య, వెంకటస్వామి, టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. హనుమంతుని పాడు : మాజీ ఎమ్మెల్యే, టిడిపి కనిగిరి నియోజక వర్గ ఇన్‌ఛార్జి డాక్టర్‌ ఉగ్ర నరసింహారెడ్డి జన్మదిన వేడుకలను స్థానిక కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా టిడిపి మండల అధ్యక్షుడు సానికొమ్ము తిరుపతిరెడ్డి ఆధ్వర్యంలో సర్వమత ప్రార్ధనలు నిర్వహించారు. అనంతరం ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి 51వ జన్మదిన వేడుకలు 51 కేజీల భారీ కేక్‌ కటింగ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో దొడ్డి చింతల సర్పంచి సానికొమ్ము బ్రహ్మారెడ్డి, గాయం రామిరెడ్డి, చీకటి వెంకటసుబ్బయ్య, మురహరి నరసయ్య, కోటపాటి శేషయ్య, రెడ్డెం తిరుపతిరెడ్డి, ఎంపిటిసి ఉడుముల సుబ్బారెడ్డి, శ్యామల వెంకటేశ్వర్లు, కూరాకు బాలనారాయణ, సానికొమ్ము వెంకటేశ్వర రెడ్డి, కందుల వెంకటసుబ్బారెడ్డి, పెంచికల రామకష్ణ, కోటిరెడ్డి, రఘునాథ కాశిరెడ్డి, టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️