మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్‌ ప్రజలు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలని అన్నమాచార్య ఫార్మసీ కళాశాల ఎన్‌ఎస్‌ఎస్‌ యూనిట్‌ బంద సభ్యులు పేర్కొన్నారు. బోయినపల్లిలోని అన్నమాచార్య ఫార్మసీ కళాశాల ఎన్‌ఎస్‌ఎస్‌ బందం వారు బుధవారం ప్రత్యేక క్యాంపు ఏర్పాటు చేసి కళాశాల నుంచి బోయినపల్లి వరకు ర్యాలీ నిర్వహించి మాదకద్రవ్యాలు, మద్యపానం, ధూమపానం వలన కలిగే దుష్ప్రభావాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కళాశాల కార్యనిర్వహణ అధికారి వై.ప్రదీప్‌ కుమార్‌ మాట్లాడుతూ మద్యం సేవించడం వలన కాలేయం, గుండె ఇతర ముఖ్యమైన అవయవాలు దెబ్బతింటాయని, కాలేయ క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం ఉందని తెలిపారు. మద్యపానం మెదడును ప్రభావితం చేస్తుందని, కుటుం బంలో మానవ సంబంధాలను దెబ్బతీస్తాయని అన్నారు. ధూమపానం వలన శాసకోశ వ్యాధులు, న్యుమోనియా, గుండె సంబంధిత వ్యాధులు వస్తాయని అన్నారు. ధూమపానం చేసేవారే కాకుండా ఆ పొగను పీల్చే పక్క వారు కూడా ఊపిరితిత్తులు, గొంతు క్యాన్సర్‌ వ్యాధి బారిన పడే ప్రమాదం ఉందని అన్నారు. ఈ వ్యాధులు అరికట్టడానికి ప్రతి ఒక్కరూ చైతన్యవంతులు కావాలని సూచించారు. కళాశాల కార్యదర్శి చొప్పాగంగిరెడ్డి, కోశాధికారి అబి óషేక్‌రెడ్డి, వైస్‌చైర్మన్‌ ఎల్లారెడ్డి, చైర్మన్‌ సి.రామచంద్రారెడ్డి, కళాశాల ప్రిన్సిపల్‌ డి.స్వర్ణలత మాట్లాడుతూ ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రత్యేక క్యాంపు ద్వారా అన్నమాచార్య కళాశాల సమాజానికి ఎన్నో సేవలు అందిస్తోందని తెలిపారు.

➡️