మానవత్వం చాటిన కరణం వెంకటేష్‌

ప్రజాశక్తి-చీరాల: నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కరణం వెంకటేష్‌ బాబు మానవతాన్ని చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన మహిళను దగ్గరుండి 108 వాహనంలో వైద్యశాలకు పంపించి సపర్యలు చేశారు. వివరాల్లోకి వెళితే.. బాపట్ల పట్టణానికి చెందిన కళ్యాణి అనే మహిళా పట్టణంలోని ఓ షాపింగ్‌ మాల్‌ లో వస్త్రాలు కొనుగోలు చేసి కుమారుడు భార్గవ్‌ తో కలసి ద్విచక్ర వాహనంపై రైల్వే ఓవర్‌ బ్రిడ్జిపైన ప్రయాణం చేస్తుంది. అయితే ప్రమాదవశాత్తు ఆ మహిళ చీర కొంగు ద్విచక్ర వాహన చక్రానికి చుట్టుకోవడంతో ఆమె ఒక్కసారిగా రోడ్డుపై డివైడర్‌కు పడింది. దీంతో ఆమెకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ నేపథ్యంలో అదే మార్గంలో కారు లో ప్రయాణిస్తున్న చీరల నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కరణం వెంకటేష్‌ ప్రమాదం ఘటనను గుర్తించి హుటాహుటిగా వాహనాన్ని దిగారు. వెంటనే మహిళ వద్దకు వెళ్లి ఆమెకు సపర్యాలు చేశారు. ప్రమాదం జరిగిన తీరును తెలుసుకొని వెంటనే 108 వాహనాన్ని ఆయనే స్వయంగా పిలిపించారు. మహిళ బాపట్ల వాసి కావడం ఎవరూ లేకపోవడంతో ఆమెకు ధైర్యం చెబుతూ ఓవర్‌ బ్రిడ్జిపైనే ఆమెతోపాటు ఉన్నారు. 108 వాహనం రావడంతో దగ్గరుండి వాహనాన్ని ఎక్కించి వైద్యశాలకు పంపించారు. ఆమెకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యానికి సంబంధించి ఎలాంటి అవసరం అయినా తాను ఉన్నానని ఆమెకి ధైర్యం చెబుతూ వెంకటేష్‌ తన అనుచరుల సాయంతో ఆమెను వైద్యశాలకు పంపించారు. ఆపత్కాలంలో మానవత్వం చాటిన వెంకటేష్‌ సేవా భావం పట్ల క్షతగాత్రులు రాలైన కళ్యాణి తో పాటుగా స్థానికులు హర్షం వ్యక్తం చేస్తూ చేశారు వెంకటేష్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

➡️