మానవత్వానికి నిలువుటద్దం ‘స్వర్ణాంధ్ర’

Jan 6,2024 23:28
సేవకు నిలువుటద్దం

ప్రజాశక్తి – రాజమహేంద్రవరం

మానవత్వానికి, నిస్వార్థ సేవకు నిలువుటద్దం ‘స్వర్ణాంధ్ర’ స్వచ్ఛంద సేవా సంస్థ అని ఎంపి మార్గాని భరత్‌ రామ్‌ అన్నారు. శనివారం లాలా చెరువు సమీపంలోని స్వర్ణాంధ్ర స్వచ్ఛంద సేవా సంస్థ రజతోత్సవ కార్యక్ర మం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభ లో ఎంపి భరత్‌ పాల్గొని సంస్థ వ్యవస్థాపకుడు డాక్టర్‌ గుబ్బల రాంబాబు చేస్తున్న సేవలను కొనియాడారు. కడుపున పుట్టిన బిడ్డలు తల్లిదండ్రులను వృద్ధాప్యంలో కంటికి రెప్పలా చూసుకోవాలన్నారు. పిల్లల ఉన్నతిని నిరంతరం కాంక్షిస్తూ కలలు కనే తల్లిదండ్రులను వృద్ధాప్య దశలో అనాధలుగా రోడ్డున వదిలేయడం ఏ మాత్రం భావ్యం కాదన్నారు. స్వర్ణాంధ్ర రాంబాబు మానవత్వంతో ఎందరో అభాగ్యులు, వృద్ధులు, అనాధలను అక్కున చేర్చుకుని ఆపద్భాధువుడుగా నిలుస్తున్నారని కొనియడారు. సేవాతత్పరతతో మంచి పనులు చేసే స్వర్ణాంధ్రా సంస్థను ఆదరించి, సహకరించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఎటువంటి స్వార్థం లేకుండా మానవత్వంతో ఒక స్వచ్ఛంద సేవా సంస్థను రెండున్నర దశాబ్దాలుగా నిర్వహచడం సాధారణ విషయం కాదన్నారు. ప్రజల ప్రోత్సాహం, సహకారం ముఖ్యమని అన్నారు. ఎన్నో బృహత్తర సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న స్వర్ణాంధ్ర సేవా సంస్థ నిర్వాహకుడు గుబ్బల రాంబాబు, ఆయన మిత్ర బృందాన్ని ఎంపి భరత్‌, రుడా ఛైర్మన్‌ రౌతు సూర్యప్రకాశరావు తదితర ప్రముఖులు అభినందించారు. అనంతరం వృద్ధులకు రగ్గులు, పలువురు పేద మహిళలకు కుట్టు మిషన్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నక్కా శ్రీనగేష్‌, అజ్జరపు వాసు, రెడ్డి, నయనాల కృష్ణారావు, మల్లాడి శ్రీను తదితరులు పాల్గొన్నారు.

➡️