మానసిక వికలాంగులకు అన్నదానం

ప్రజాశక్తి-యర్రగొండపాలెం: యర్రగొండపాలెం పట్టణంలోని మాచర్ల రోడ్డులో ఉన్న సన్‌జో సేవాలయంలో ఆశ్రయం పొందుతున్న మానసిక వికలాంగులకు మాజీ ఎంపీటీసీ సభ్యులు మెడబలిమి రాజశేఖర్‌ మంగళవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ప్రముఖ దళిత నేత, మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి సన్నిహితుడు స్వర్గీయ మెడబలిమి చంద్రశేఖర్‌ సతీమణి స్వర్గీయ మెడబలిమి అంకమ్మ జ్ఞాపకార్థం ఆయన కుమారుడైన మెడబలిమి రాజశేఖర్‌ ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా రాజశేఖర్‌ మాట్లాడుతూ ప్రతి యేటా తన తల్లిదండ్రుల పేరిట సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరూ మానసిక వికలాంగులను ఆదుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని అన్నారు. ముందుగా ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో గుర్రపుశాల పంచాయతీ కార్యదర్శి ఎలక శ్రీనివాసులు, ఉపాధి హామీ జేఈ పాలపర్తి రమేష్‌బాబు, డాల్డా శ్రీను, వెంకట్రావు, అడిపి వెంకటేశ్వరు,్ల ఎస్‌విఆర్‌, తోమాటి శ్రీను, పెండ్యాల అరుణ్‌, షేక్‌ కరిముల్లా, రాజారపు శ్రీను తదితరులు పాల్గొన్నారు.

➡️