మిర్చి పంట ధ్వంసంపై టిడిపి నిరసన

పొలంలో నిరసన తెలుపుతున్న బాధితులు, నాయకులు
ప్రజాశక్తి – వినుకొండ :
రాజకీయ కక్షతో మిర్చి పంటను ధ్వంసం చేసిన దుండగులను శిక్షించాలని టిడిపి నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు మండలంలోని నడిగడ్డలో ధ్వంసమైన మిర్చి పొలంలో మంగళవారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా టిడిపి మండల అధ్యక్షులు ఎం.ఆంజనేయులు, సీనియర్‌ నాయకులు ఎల్‌.వెంకట్రావు, పి.నాగేశ్వరరావు మాట్లాడుతూ టిడిపి గ్రామ అధ్యక్షులు పూడెపూడి వీరాంజనేయులు, అతని సోదరి వనజాక్షిపై రాజకీయ కక్షతో అధికార పార్టీకి చెందిన వారు మిర్చి పంటను నరికివేశారని అన్నారు. వీరాంజనేయులు, వారి కుటుంబ సభ్యులు టిడిపిలో చురుగ్గా పనిచేస్తున్న కారణంగా ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఇలాంటి కక్ష సాధింపు చర్యలు చేయిస్తున్నారని ఆరోపించారు. వైసిపిలో చేరాలని ఒత్తిళ్లు తెచ్చి చేరని కారణంగా గతంలోనూ వీరి కుటుంబాలపై అక్రమ కేసులు పెట్టించారని అన్నారు. ఎన్నడూ లేని విధంగా పచ్చని పల్లెల్లో ఎమ్మెల్యే చిచ్చు పెడుతున్నారని, తన రాజకీయాల కోసం ప్రజల్ని బలి చేస్తు న్నారని మండిపడ్డారు. మిర్చి మొక్కలను నరికిన ఘటనలో వైసిపి దుండగులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో వి.పేరయ్య, కె.వెంకటరెడ్డి, బి.గోవిందరాజులు, ఆర్‌.వీరాంజనేయరెడ్డి, ఎం.రామ బ్రహ్మం, వి.కృష్ణారెడ్డి, ఎం.ఏడుకొండలు పాల్గొన్నారు.

➡️