మిర్చి పంట పరిశీలన

ప్రజాశక్తి మార్కాపురం రూరల్‌ : వ్యవసాయ అధికారులు మండల పరిధిలోని ఎల్‌బిఎస్‌నగర్‌, చింతకుంట, తిప్పాయపాలెం గ్రామాల్లో శుక్రవారం పర్యటించారు. రైతులు ఎస్‌డబ్ల్యుఎస్‌ 450 రకం మిరప విత్తనాలు సాగు చేసి నష్టపోయిన పొలాలను పరిశీలించారు. బాధిత రైతులతో మాట్లాడారు. సమస్యను వ్యవసాయ శాఖ ఉన్నతాధికారుల దష్టికి తీసుకెళ్లి బాధిత రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎఒ దేవిరెడ్డి శ్రీనివాసులు, హర్టికల్చర్‌ అధికారి దాసు రమేష్‌, తిప్పాయపాలెం, చింతకుంట ఆర్‌బికె సిబ్బంది శివశంకర్‌ నాయక్‌, వెంకటేశ్వర రెడ్డి, రైతులు పాల్గొన్నారు.మిర్చి పంటను పరిశీలిస్తున్న అధికారులు

➡️