ముగిసిన నియోజకవర్గ ఆదుదాం ఆంధ్ర క్రీడా పోటీలు

Jan 25,2024 20:17

  ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ :  క్రీడలు శారీరక దారుఢ్యంతో పాటూ మానసిక ఉల్లాసానికి దోహదపడతాయని డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. గురువారం స్థానిక రాజీవ్‌ స్టేడియంలో ఆడదాం ఆంధ్ర నియోజకవర్గ స్థాయి క్రీడా పోటీలు జరిగాయి. అనంతరం విజేతలకు మెమొంటోలు, పథకాలను బహుకరించారు. క్రికెట్‌ పోటీలో ప్రధమ విజేతగా పూల్‌ బాగ్‌ కాలనీ, రెండవ విజేతగా బొబ్బదిపేట, మూడో విజేతగా నారాయణపురం నిలవగా, బ్యాట్మెంటన్‌ పోటీలో పూల్‌ బాగ్‌ కాలనీ, నారాయణపురం, ప్రదీప్‌ నగర్‌ జట్లు నిలిచాయి. కబడ్డీ పోటీలో పేర్ల వారి జంక్షన్‌ మొదటి బహుమతి, ధర్మపురి రెండో బహుమతి, జొన్నవలస మూడో బహుమతి గెలుచుకున్నారు. ఖోఖోలో బాబామెట్ట మొదటి విజేతగా, రెండవ మూడవ విజేతలుగా జొన్నవలస నిలిచారు. వాలీబాల్‌ లో శివాలయం మొదటి విజేతగా, కాళీఘాట్‌ కాలనీ రెండో విజేతగా, కొండకరకాం మూడో విజేతగా నిలిచారు.ఈ సందర్భంగా డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్రస్వామి మాట్లాడుతూ సచివాలయ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు పోటీలు నిర్వహించి గెలుపొందిన క్రీడాకారులకు పతకాలను, నగదు బహుమతులను అందజేస్తుం దన్నారు. నియోజకవర్గస్థాయిలో గెలుపొందిన 9 టీంలు జిల్లా స్థాయి, రాష్ట్రస్థాయిలో కూడా విజేతలుగా నిలవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మేయర్‌ విజయలక్ష్మి, ఎంపిపి మామిడి అప్పలనాయుడు, కమిషనర్‌ ఆర్‌. శ్రీరాములునాయుడు, సహాయ కమిషనర్‌ ప్రసాదరావు, జిల్లా కబడ్డీ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి కాళ్ళ సూరిబాబు, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, క్రీడాకారులు పాల్గొన్నారు.

➡️