మున్సిపల్‌ కార్మికుల అర్ధనగ ప్రదర్శన

ప్రజాశక్తి- గిద్దలూరు రూరల్‌ : సమ్మెలో భాగంగా కార్మికులు అర్ధనగ ప్రదర్శన నిర్వహించారు. సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్‌ కార్యాలయం వద్ద నుంచి గాంధీ బొమ్మ సెంటర్‌ వరకూ అర్ధ నగ ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా యూనియన్‌ నాయకులు మురళి, నాగయ్య మాట్లాడుతూ సిఎం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. పారిశ్యుధ కార్మికులను పర్మినెంట్‌ చేయాలన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న కార్మికులకు జీతంతో కూడిన సెలవులు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు బండా నరసింహులు, డి. శ్రీనివాసులు, ఇంజినీరింగ్‌ వర్కర్స్‌ నాయకులు మౌలాలి, మస్తాన్‌ రెడ్డి,వెంకట్రావు ,పారిశుధ్య కార్మిక నాయకులు పాపయ్య, చంటయ్య, సుందర్‌రావు , వెంకటయ్య పాల్గొన్నారుచీమకుర్తి సమ్మెలో భాగంగా మున్సిపల్‌ కార్మికులు నిరసన ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్‌నగర్‌ నుంచి మున్సిపల్‌ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ జిల్లా ఉపాధ్యక్షుడు ఇట్టానాగయ్య మాట్లాడుతూ కార్మికుల సమ్మె కారణంగా చెత్త కుప్పలు పేరుకుపోతున్నాయని తెలిపారు. దాన్ని అధికారులు తగులబెట్టడం వల్ల పొగతో కూడిన కాలుష్యం ఏర్పడుతుందన్నారు. ప్రజలు ఇబ్బందుల పడుతున్నారన్నారు. సిఐటియు నాయకులు పూసపాటి వెంకటరావు మాట్లాడుతూ కార్మికుల సమస్యలు పరిష్కరించి సమ్మెను విరమింపజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు అల్లడి కోటేశ్వరరావు,పి కోటేశ్వరరావు, పద్మ, ఏడుకొండలు, చెన్నమ్మ, విజరు, సామియేలు, విజయ, గోవిందు, దాసు, అంకమ్మరావు,అరుణ పాల్గొన్నారు.

➡️