మున్సిపల్‌ కార్మికుల బైక్‌ ర్యాలీ

Dec 24,2023 21:34

ప్రజాశక్తి – సాలూరు: ఈనెల 26నుంచి చేపట్టనున్న సమ్మెకు మద్దతు తెలపాలని కోరుతూ మున్సిపల్‌ కార్మికులు ఆదివారం బైక్‌ ర్యాలీ చేపట్టారు.మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ పట్టణ నాయకులు టి.శంకర్‌ ఆధ్వర్యాన నిర్వహించిన ర్యాలీ పట్టణ ప్రధాన రహదారి మీదుగా సాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికులకు కనీస వేతనం 26వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని కోరారు. ఫేస్‌ యాప్‌ రద్దు చేయాలని, పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని డిమాండ్‌ చేశారు. సమ్మెకు వెళ్లడానికి ప్రభుత్వ మొండి వైఖరే కారణమని చెప్పారు. ప్రజలు మద్దతు తెలపాలని కోరారు. కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు పోలరాజు ,చంటి పాల్గొన్నారు.

➡️