మున్సిపల్‌ కార్మికుల భిక్షాటన

Jan 10,2024 21:12

ప్రజాశక్తి-కడప అర్బన్‌ నగరపాలక సంస్థలో పనిచేస్తున్న కార్మికులు సమ్మెలో భాగంగా 16వ రోజు వినూత్న రీతిలో తమ నిరసన తెలియజేశారు. బుధవారం కార్పొరేషన్‌ గేట్‌ దగ్గర శుభ్రపరిచి ముగ్గులు వేసి, గొబ్బెమ్మ ఏర్పాటు చేసుకుని అందంగా అలంకరించారు. చెక్కభజన కార్యక్రమం చేస్తూ మారాలి జగన్‌ మాకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి జగన్‌ అంటూ.. ఈ సంక్రాంతి కన్నా జగన్‌ మారి మాకు ఇచ్చిన హామీని నెరవేర్చడంటూ తమ నిరసన తెలియజేశారు. కార్మికులంతా కలసి చెక్క భజన చేస్తూ, మారాలి జగన్‌ ఇచ్చిన హామీలు నెరవేర్చాలి జగన్‌ అంటూ నినాదాలతో హౌరెత్తించారు. భిక్షాటన చేస్తూ మారాలి జగన్‌ అంటూ నగరం లో దుకాణాల వద్ద భిక్షాటన చేశారు. ఈ సందర్భంగా సుంకర రవి మాట్లాడుతూ మంత్రి అది మూలపు సురేష్‌ చర్చలకు సంబంధించి 70 శాతం కార్మికుల డిమాండ్లను నెరవేర్చామని చెప్పడం అవాస్తవమన్నారు. గతంలో కార్మికులకు రూ.15 వేలు జీతం గాను రూ.6000 విడిగా విడిగా ఇచ్చేవారని చెప్పారు. 16 రోజుల సమ్మె చేస్తుంటే ఆ రెండిటిని ఒకటిగా చేసి జీతం రూ.21 వేలు ఇచ్చాం, 70 శాతం డిమాండ్లను నెరవేర్చమని ప్రజలకు, మీడియాకు తప్పుడు సమాచారం ఇవ్వడం మీ స్థాయికి తగదని తెలిపారు. మీకు కార్మికుల పట్ల చిత్తశుద్ధి ఉంటే జగనన్న అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీని, దేశంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వారు ఇచ్చిన సమాన పనికి సమాన వేతనము ఇచ్చి కార్మికులు 100 శాతం డిమాండ్ల నెరవేర్చమని ప్రకటన చేయడాన్నిసిఐటియుగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో కంచుపాటి తిరుపాల్‌, వడ్లపల్లి శ్రీధర్‌ బాబు, కంచుపాటి శ్రీరాములు, సుంకర కిరణ్‌ ఆదాం ఆనంద్‌ నాగరాజు, ఇత్తడి ప్రకాష్‌, కొండయ్య,కుమార్‌ శివ, దస్తగిరిమ్మ, ధరణి, కొండమ్మ,లక్ష్మి, ఆరోగ్యమ్మ, కార్మికులు, పెద్ద ఎత్తున మహిళ పాల్గొన్నారు. జమ్మలమడుగు : మున్సిపల్‌ కార్మికులు చేపట్టిన సమ్మె 16వ రోజుకు చేరుకుంది. కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి ఏసుదాసు, సిఐటియు పట్టణ కార్యదర్శి దాసరి విజరు, మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు శేఖర్‌, డివైఎఫ్‌ఐ బాధ్యుడు ఎ.వినరు కుమార్‌, పారిశుధ్య కార్మికులు పాల్గొన్నారు. మైదుకూరు: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం జగన్మోహన్‌రెడ్డి కార్మికులకు ఆప్కాస్‌ కాకుండా రెగ్యులర్‌ చేయాలని మున్సిపల్‌ కార్మికులు సాష్టాంగ నమస్కారంతో నిరసనలు తెలిపారు. పట్టణంలోని పాత మున్సిపల్‌ కార్యాలయం ఆవరణంలో కార్మికులు నిరవధిక సమ్మెలో పాల్గొన్నారు. ప్రొద్దుటూరు : మున్సిపల్‌ కార్మికులు సమ్మె కొనసాగిస్తున్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ తమ రెండు చేతులు జోడించి వేడుకుంటూ నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కార్మిక సంఘ గౌరవాధ్యక్షుడు సత్యనారాయణ, రాష్ట్ర కమిటీ సభ్యులు విజయకుమార్‌, సంఘ అధ్యక్ష, కార్యదర్శులు సాల్మన్‌, చంటి, కోశాధికారి రాఘవ, సహాయ కార్యదర్శి మోహన్‌. ఉపాధ్యక్షులు గుర్రమ్మ, రమాదేవి ప్రమీలమ్మ, పాల్గొన్నారు.

➡️