మున్సిపల్‌ స్థలంలో ఇళ్ల పట్టాలివ్వాలి

Mar 3,2024 21:10

ప్రజాశక్తి- బొబ్బిలి : మున్సిపల్‌ పారిశుధ్య కార్మికులు నివసించే చిక్కాల, రెల్లివీధికి అనుసరించి ఉన్న మున్సిపల్‌ స్థలంలో పారిశుధ్య కార్మికులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు పి.శంకరరావు డిమాండ్‌ చేశారు. ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ ఆదివారం మున్సిపల్‌ స్థలం వద్ద ధర్నా చేశారు. ఈ సందర్భంగా శంకరరావు మాటా ్లడుతూ మున్సిపల్‌ పారిశుధ్య కార్మికులకు మున్సి పల్‌ స్థలంలో ఇళ్ల పట్టాలు ఇస్తామని 1992లో ప్రభుత్వం ఒకొక్కరు నుంచి రూ.350 కట్టించు కుని ఇళ్ల పట్టాలు ఇవ్వకపోవడం అన్యాయ మన్నారు. ఇళ్ల పట్టాలు ఇస్తామన్న స్థలంలో మున్సిపల్‌ అధికారులు మురుగునీటి శుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించడం దుర్మార్గమన్నారు. ఇరుకు ఇళ్లల్లో రెండు నుంచి మూడు కుటుంబాలు నివసించి తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని, ప్రభుత్వం స్పందించి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఇళ్ల పట్టాలు ఇవ్వకపోతే మున్సిపల్‌ స్థలాన్ని ఆక్రమిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ యూనియన్‌ నాయకులు జి.వాసు, జగదీష్‌, ప్రజలు పాల్గొన్నారు.

➡️