మూడు తరాల నుంచి అక్రమ వ్యాపారాలే…

Dec 6,2023 00:08
ఎన్నికల్లో నాలిక

ప్రజాశక్తి – కాకినాడ

తన మూడు తరాల కోసం ఎంఎల్‌ఎ ద్వారంపూడి చంద్రశేఖర్‌ రెడ్డి ఎన్నో గొప్పలు చెప్పుకుం టున్నారని, కానీ ఆయన కుటుంబం మూడు తరాలూ అక్రమాలు, అన్యాయాలు, చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడే ఈ స్థాయికి వచ్చా యని మాజీ ఎంఎల్‌ఎ వనమాడి కొండబాబు ధ్వజమె త్తారు. మంగళవారం టిడిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ద్వారంపూడి మూడు తరాలు నల్లమందు, గంజాయి, దొంగ నోట్లు చెలామణి, అక్రమ బియ్యం వ్యాపారాలే సాగించారని ఆరోపించారు. ఏనాడు ప్రజాహిత కార్యక్రమాలు చేసిన దాఖలాలు లేవని విమర్శం చారు. ఇతరుల కుటుంబాలను విమర్శిస్తున్న ఆయనను చూసి వారి చీకటి వ్యాపార చరిత్ర తెలిసిన ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. లోకేష్‌ చేపట్టిన యువగళం పాదయాత్రకు ప్రజల నుంచి అనూహ్య మైన రీతిలో స్పందన వచ్చిందన్నారు. ప్రజల స్పందనను చూసి ఓర్వలేకనే యువగళం పాద యాత్రపై ద్వారంపూడి తన అక్కసును వెళ్లగక్కారని అన్నారు. కాకినాడలో బహిరంగ సభ విజయవంతం కావడంతో వైసిపి నాయకులకు కంటి మీద కునుకు రాక అవాకులు..చవాకులు పేలుతున్నారని మండి పడ్డారు. నగరంలో ద్వారంపూడి భూకబ్జాలు, అరాచ కాలు పెరిగిపోయాయని పేర్కొన్నారు. తమ లోకేష్‌ నాలుకను చీరేస్తానని అంటున్న ద్వారంపూడికి 2024 ఎన్నికల్లో నాలిక చీరేస్తానని అన్నారని 2024 ఎన్నికల్లో ద్వారంపూడిని చీరేయ డానికి కాకినాడ ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ద్వారంపూడి మాదిరిగా తాను వ్యక్తిగతంగా విమర్శంచగలనని, కానీ తనకు సంస్కారం అడ్డు వస్తుందని తెలిపారు. ఈ సమావేశంలో టిడిపి నాయకులు ఎం.వీరు, పి.రవి, టి.రమేష్‌, బి.సత్యనారాయణ, జి.లక్ష్మణరావు, శేఖర్‌, ఎస్‌ఎ.తాజుద్దీన్‌, ఒమ్మి బాలాజీ పాల్గొన్నారు.

➡️