Jun 29,2024 00:56 #rto, #Schoolbus
స్కూలు బస్సులు, ఆటోలపై కేసులు

ప్రజాశక్తి – విశాఖ కలెక్టరేట్‌ :

నిబంధనలు ఉల్లంఘించిన రెండు స్కూల్‌ బస్సులు, మూడు ఆటోలపై కేసులు నమోదు చేశామని, మూడు ఆటోలను సీజ్‌ చేశామని డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్‌ కమిషనర్‌ రాజారత్నం మీడియాకు తెలిపారు. శుక్రవారం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి కొమ్మాది తదితర ప్రాంతాలలో స్కూలు, కాలేజీ బస్సులపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించామన్నారు. ఈ నెల 13 నుండి ఇప్పటి వరకు 36 బస్సులపై కేసుల నమోదు చేసి ఒక బస్సును సీజు చేశామని, అలాగే 24 ఆటోలపై కేసులు నమోదు చేసి నాలుగు ఆటోలను సీజు చేశామని వెల్లడించారు.

తనిఖీలు చేపడుతున్న అధికారులు

➡️