మూడో రోజు అంగన్‌వాడీల సమ్మె

మూడో రోజు అంగన్‌వాడీల సమ్మె

ప్రజాశక్తి-యంత్రాంగం అంగన్‌వాడీల నిరవధిక సమ్మె గురువారం జిల్లావ్యాప్తంగా కొనసాగింది. తహశీల్దారు కార్యాలయాల వద్ద అంగన్‌వాడీలు, వర్కర్లు మోకాళ్లపై నిలబడి వినూత్నంగా నిరసన తెలిపారు. అంగన్‌వాడీ కేంద్రాల తాళాలు బద్దలు కొట్టి తెరిపించి వారి సమ్మెను నిర్వీర్యం చేయడానికి అధికార యంత్రాంగం ప్రయత్నాలు చేసింది.చాగల్లు తహశీల్దార్‌ కార్యాలయం వద్ద అంగన్వాడీలు మోకాలిపై సమ్మె చేస్తూ నిరసన తెలిపారు. సిపిఎం నాయకులు కెకె.దుర్గారావు, గారపాటి వెంకట సుబ్బారావు, ఎస్‌కె.ఆదం, రామనాథ మురళి మాట్లాడారు. సిఎం వైఎస్‌.జగన్‌ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు విస్మరించారన్నారు. తెలంగాణ కంటే రూ.వెయ్యి ఎక్కువగానే ఇస్తామని, రూ.5 లక్షల రిటైర్‌మెంట్‌ అలవెన్స్‌లు ఇస్తామని చెప్పారని, అధికారంలోకి వచ్చి ఐదేళ్లు పూర్తి కావస్తున్నా రిటైర్‌అమౌంట్‌ అలవెన్స్‌ రూ.50 వేలు మాత్రమే వస్తోందన్నారు. అంగన్‌వాడీ అక్క చెల్లెమ్మలను సిఎం జగన్‌ పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. టిడిపి నాయకులు ఆళ్ల హరిబాబు, నాదాల శ్రీరామ్‌ చౌదరి అంగన్‌వాడీలకు మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో పి.విజయ కుమారి, కె.లక్ష్మి, కె.దమయంతి, బి.మహాలక్ష్మి, ఎ.శ్రీదేవి, ఎస్‌.అరుణ కుమారి పాల్గొన్నారు. సీతానగరం తహశీల్దారు కార్యాలయం వద్ద కోరుకొండ ప్రోజెక్టు సూపర్‌వైజర్‌ సుబ్బలక్ష్మి ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. మండలంలో 69 సెంటర్ల నుండి 138 మంది అంగన్వాడీ వర్కర్లు సమ్మెలో పాల్గొన్నారు. వీరికి టిడిపి రాజానగరం ఇన్‌ఛార్జి బొడ్డు వెంకటరమణ చౌదరి, జనసేన నాయకులు బత్తుల వెంకట లక్ష్మి మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో సుబ్బలక్ష్మి, సిహెచ్‌.సువర్ణ, సుభాషిణి, ఉమాదేవి, ప్రశాంతి, వెంకట్‌ లక్ష్మి వెంకటేశ్వరి పాల్గొన్నారు. ఉండ్రాజవరం తహశీల్దారు కార్యాలయం వద్ద సమ్మె చేపట్టారు. ఈ సమ్మెలో 63 మంది టీచర్లు, 61 మంది ఆయాలు మోకాళ్లపై నిలబడి నిరసన వ్యక్తం చేశారు. సెక్టార్‌ లీడర్‌ ఎస్‌.రంగనాయకమ్మ మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ, జనసేన నాయకులు సమ్మె ప్రాంతానికి చేరుకుని మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో కె.లకీëకుమారి, ఎం.జానకి, కెఎన్‌ఎస్‌.ప్రసన్నకుమారి, కె.విజయ కుమారి, కె.వరలక్ష్మి పాల్గొన్నారు. దేవరపల్లి అంగన్వాడీలకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని గోపాలపురం మాజీ ఎంఎల్‌ఎ ముప్పిడి వెంకటేశ్వరరావు డిమాండ్‌ చేశారు. తహశీల్దారు కార్యాలయం వద్ద అంగన్వాడీల సమ్మె శిబిరాన్ని ఆయన సందర్శించి మద్దతు తెలిపారు. ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా అంగన్వాడీలను మోసం చేయడం దుర్మార్గమన్నారు. ధరలు పెరుగుతురన్నా వేతనాలు ఎందుకు పెంచరని ప్రశ్నించారు. సిఐటియు మండల కార్యదర్శి ఎస్‌.భగత్‌ మాట్లాడుతూ సమ్మె విచ్ఛిన్నానికి ప్రభుత్వం ప్రయత్నించడం దుర్మార్గమన్నారు అనిచివేతతో సమస్యలు పరిష్కరించలేమని ప్రభుత్వం గుర్తించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఉండవల్లి కృష్ణారావు, సిఐటియు నాయకులు టిపి.లక్ష్మి, కె.రత్నాజీ, రైతు సంఘం నాయకులు పిన్నమనేని సత్యనారాయణ, ఇ.పద్మకామేశ్వరి, కె.గంగాభవాని, కె.కుమారి, డి.పద్మప్రియ, ఆర్‌.స్పందన పాల్గొన్నారు. కొవ్వూరు రూరల్‌ ఆర్‌డిఒ కార్యాలయం వద్ద మూడో రోజు నిరవధిక సమ్మె దీక్ష శిబిరాన్ని కొనసాగించారు. అంగన్వాడి వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షులు సిహెచ్‌.మాణిక్యమ్మ మాట్లాడారు. సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎం.సుందర బాబు, సిహెచ్‌.మాణిక్యాంబ, జిల్లా అధ్యక్షురాలు సిహెచ్‌వి.లక్ష్మి, పుష్పవతి, బొందపాటి వెంకట పద్మజ, టిడిపి నాయకులు జొన్నలగడ్డ సుబ్బయ్య చౌదరి, కంటమని రామకృష్ణ, సూరపనేని చిన్ని, జనసేన పార్టీ నాయకులు టివి.రామారావు, తొర్లపాటి శీతల్‌, గాయత్రి వెంకటేశ్వరరావు, సిపిఎం నాయకులు దగ్గర రాధాకృష్ణ ఐఎఫ్‌టుయు నాయకులు పి.నాగేశ్వరరావు, గురునాథ్‌ మద్దతు తెలిపారు. పెరవలి తహశీల్దారు కార్యాలయం వద్ద చేపట్టిన దీక్షా శిబిరంలో సిఐటియు జిల్లా నాయకులు జువ్వల రాంబాబు మాట్లాడారు. అంగన్‌వాడీలకు టిడిపి, బిఎస్‌పి, జనసేన పార్టీలు మద్దతు తెలిపాయి. టిడిపి మండల అధ్యక్షుడు అతికాల రామకృష్ణ, బిఎస్‌పి రాష్ట్ర కోఆర్డినేటర్‌ గుమ్మపుచిత్ర చేన్‌, నాయకులు వెన్నపు సుధాకర్‌, పులిదిండి నాగరాజు, చల్లాబత్తుల సత్యనారాయణ, నల్లి రమేష్‌, జాన్‌, డిసిఎంఎస్‌ మాజీ చైర్మన్‌ రవివర్మ, జనసేన నేత పిప్పర రవికుమార్‌, కోటిపల్లి మురళీకష్ణ, దుర్గ, రామలక్ష్మి, శ్రీదుర్గ, కన్యాకుమారి, విజయ, పుణ్యవతి, జ్యోతి, నాగలక్ష్మి, రాణి, కృష్ణవేణి, విశాలి, సత్తార్‌బీ, సుజాత పాల్గొన్నారు. గోపాలపురం ఎంపిడిఒ కార్యాలయం వద్ద సిఐటియు నేత రామలక్ష్మి ఆధ్వర్యంలో చేపట్టిన సమ్మెలో మండలంలోని అన్ని గ్రామాల నుంచీ పెద్ద ఎత్తున అంగన్వాడీలు తరలి వచ్చారు. రాజానగరం సాయిబాబా గుడి సమీపంలో అంగన్వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ ధర్నా నిర్వహించారు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. ఎం.మార్తమ్మ పాల్గొన్నారు. కడియం సిఐటియు, అంగన్వాడి వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో తహసీల్దార్‌ కార్యాలయం సమీపంలో సమ్మె చేపట్టారు. వీరికి కడియం ఎంపిపి వెలుగుబంటి ప్రసాద్‌, టిడిపి మండల అధ్యక్షుడు వెలుగుబంటి నాని మద్దతు తెలిపారు.

➡️