మూల్యాంకన కేంద్రంలో సౌకర్యాలు కల్పించాలి

ప్రజాశక్తి-కడప అర్బన్‌ పదవతరగతి స్పాట్‌ వ్యాల్యూషన్‌ ఏప్రిల్‌ ఒకటి నుంచి ప్రారంభమవుతున్న సందర్భంగా అక్కడ సౌకర్యాలు కల్పించాలని మాజీ ఎంఎల్‌సి కత్తి నరసింహారెడ్డి, ఎస్‌టియు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఇలియాస్‌బాష, సంగమేశ్వర రెడ్డి కోరారు. గురువారం డిఇఒ అనురాధకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేసవి దృష్ట్యా కేంద్రంలో చల్లని నీరు, మజ్జిగ, ఫ్యాన్లు, వీలైతే కూలర్లు ఏర్పాటు చేయాలని కోరారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికి, న్యూరో సర్జరీ, ఓపెన్‌ హార్ట్‌ సర్జరీ చేయించుకున్న వారికి, చంటి బిడ్డల తల్లులకు, నూతనంగా పదోననతి పొందిన వారికి స్పాట్‌ వ్యాల్యూషన్‌ నుంచి మినహాయింపు కల్పించాలని కోరారు. పదవతరగతి పరీక్షలు విజయవంతంగా పూర్తి చేసిన డిఇఒను అభినందించారు. కార్యక్రమంలో ఎస్‌టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు రఘనాధరెడ్డి, కార్యవర్గ సభ్యులు కె.సురేష్‌బాబు, కంభం బాల గంగిరెడ్డి, రాష్ట్ర కౌన్సిలర్‌ జి.చెన్న కేశవరెడ్డి, హౌస్‌ బిల్డింగ్‌ సోసైటీ అధ్యక్షులు విశ్వనాథరెడ్డి, జిల్లా ఆర్థిక కార్యదర్శి రామమోహన్‌, కార్యవర్గ సభ్యులు రాజేంద్ర పాల్గొన్నారు.

➡️