‘మెగా’ సంస్థపై చర్యలు తీసుకోండి

Dec 12,2023 21:41
కలెక్టర్‌కు సిపిఎం ఫిర్యాదు

‘మెగా’ సంస్థపై చర్యలు తీసుకోండికలెక్టర్‌కు సిపిఎం ఫిర్యాదుప్రజాశక్తి – తిరుపతి టౌన్‌ప్రయాణికులను, వాహనదారులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్న జాతీయ రహదారి నిర్మాణ సంస్థ మెగా ఇంజనీరింగ్‌ సంస్థపై చర్యలు తీసుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు మంగళవారం కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. తిరుపతి జిల్లాలో తిరుపతి నుంచి నాయుడుపేట వరకు జాతీయ రహదారి నిర్మాణం అవుతుంది. ఈ సందర్భంగా మెగా కంపెనీ కనీస పద్ధతులు పాటించకపోవడం వల్ల పాత రోడ్డుని రిపేర్లు చేయకుండా ఉండటం వల్ల ఆ రోడ్లలో ప్రయాణించే ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గుంటలు వడిన రోడ్లలో వాహనాలు నడపడానికి వాహనదారులు మరింత అవస్థలు పడుతూ టైర్లు, ఇంజిన్లు దెబ్బతింటున్నాయని ఆవేదనకు గురవుతున్నారు. మెగా కంపెనీ పర్యవేక్షణ చేస్తున్న జాతీయ రహదారుల అథారిటీ ఏ మాత్రం శ్రద్ధ తీసుకోకపోవడం వల్ల రోడ్డు నిర్మాణంలో కొత్త రోడ్డుకి పాత రోడ్డుకి అనుసంధానం చేయకుండా పెద్ద స్థాయిలో తేడాలు ఉండడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. శ్రీకాళహస్తి స్వర్ణముఖి నదిపై ఉన్న బ్రిడ్జి మరింత హీనస్థితికి చేరుకున్నది. పెళ్లకూరు మండల కేంద్రం వద్ద, ఏర్పేడు దాటిన తర్వాత పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ రహదారుల్లో మెగా కంపెనీ టిప్పర్లు పెద్ద సంఖ్యలో తిరగడం వలన, ఈ మధ్య కురిసిన వర్షాల వలన పూర్తిగా రోడ్డు పాడైపోయిన పరిస్థితి నెలకొంది. ఎన్‌హెచ్‌ఐ అధికారులు మెగా కంపెనీ ప్రలోభాలకు లోబడి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా అలసత్వం వహిస్తున్నారని ఆరోపించారు. ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వాహనాలు సక్రమంగా తిరిగేలా రోడ్డును బాగు చేయాలని విజ్ఞప్తి చేశారు.

➡️