మెనూ ప్రకారం భోజనం అందించండి:పీడీ

ప్రజాశక్తి-లక్కిరెడ్డిపల్లి ప్రభుత్వం అందిస్తున్న మెనూ ప్రకారం నాణ్యమైన భోజనాన్ని అందించాలని మహిళ శిశు సంక్షేమ శాఖ పీడీ శశికళ పేర్కొన్నారు. బుధ వారం స్థానిక బాలసదనం, మహిళ శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్‌ కార్యాల యాన్ని పర్యవేక్షించారు. ఈ సందర్భంగా బాలసదనంలో వంట సరుకులు నాణ్యత, వంట, వంటగది, వసతి గదులను ఆమె పరిశీలించారు. బాల సదనంలో అతి తక్కువ మంది పిల్లలు ఉన్నారని ప్రభుత్వము వంద సీట్లు మంజూరు చేసిందని, పిల్లల ప్రవేశాలను పెంచాలని పేర్కొన్నారు. జూన్‌, జూలై మాసాలలో తల్లిదండ్రులు లేని పిల్లలను ప్రతి అంగన్వాడీి కార్యకర్త బాలసదనంలో చేర్పించాలని సూచించారు. అనంతరం మహిళా శిశు సంక్షేమ ప్రాజెక్టు కార్యాలయంలో రికార్డులు పరిశీలించి అంగన్వాడీ సూప ర్వౖజర్లతో సమీక్ష నిర్వహించారుజ ఆధార్‌ సీడింగ్‌ పిల్లల ఎదుగుదల నమోదు కచ్చితంగా రికార్డు చేయాలని పేర్కొన్నారు. లక్కిరెడ్డిపల్లి, రామాపురం, గాలివీడు మండలాలకు చెందిన 52 అంగన్వాడీ కేంద్రాల్లో నాడు-నేడు కింద మరమ్మతులు చేయడానికి ప్రభుత్వం నుంచి మంజూరు లభించిందని వాటికి సంబంధించి బ్యాంకు ఖాతాలు తెరవాలని అంగన్వాడీ కార్యకర్తలను ఆదేశించారు.కార్యక్రమంలో డిసిపిఒవినోద్‌, సిడిపిఒ పద్మావతి, బాలసదనం సూపర్వైజర్‌ చెల్లెమ్మ , సూపర్వైజర్లు పాల్గొన్నారు.

➡️