మెప్మా ప్రగతి యూనిట్స్‌ ప్రారంభం

Jan 31,2024 21:39
యూనిట్‌ను ప్రారంభిస్తున్న దృశ్యం

యూనిట్‌ను ప్రారంభిస్తున్న దృశ్యం
మెప్మా ప్రగతి యూనిట్స్‌ ప్రారంభం
ప్రజాశక్తి-నెల్లూరు అర్బన్‌:నెలూరు కార్పొరేషన్‌ పరిధిలోని ఎన్‌జిఒ కాలనీలో నెల్లూరు పట్టణ సమాఖ్య 3 పట్టణ ప్రగతి యూనిట్స్‌ను మెప్మా పాజెక్టు డైరెక్టర్‌ డాక్టర్‌ రవీంద్ర ప్రారంభించారు మిషన్‌ బటన్‌ నొక్కి, జాకెట్‌ నుడి డిజైన్‌ ను ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ద్వారా గ్రాంట్‌ రూపంలో పొందిన యూనిట్‌ ను విజయవంతంగా నడిపి, ఇంకొక యూనిట్‌ను ప్రారంభించే విధంగా విజయవంతంగా నడపాలని తెలిపారు.టిఎల్‌ఎఫ్‌ అధ్యక్షులు సాధన మాట్లాడుతూ ఎంపి ఆదాల ప్రభాకర్‌ రెడ్డి ప్రోత్సాహంతో యూనిట్‌ ను విజయంతంగా నడిపి అందరికీ ఆదర్శంగా ఉంటామని తెలిపారు. కార్యక్రమంలో మెప్మా సిబ్బంది, సుధాకర్‌, జరినా, శైలమ్మ, హైమావతి, సింధు జిల్లా సమాఖ్య అధ్యక్షులు జ్యోతి, టి ఎల్‌ ఎఫ్‌ అధ్యక్షులు భార్గవి రెడ్డి, హరిత పాల్గొన్నారు.

➡️