‘మొగమూరు’కు మోక్షం లభించేనా?

రూ.256 కోట్లతో ప్రతిపాదనలుఐదు వేల క్యూసెక్కులకు పెంపు35 వేల ఎకరాలకు సాగునీరుప్రజాశక్తి – కడప ప్రతినిధిజిఎన్‌ఎస్‌ఎస్‌ ఫేజ్‌-2లోని ప్యాకేజీ-1 కాల్వ పనుల పురోగతికి ప్రధాన అడ్డంకిగా మారిన మొగమూరు అక్విడక్టు నిర్మాణ పనులకు మోక్షమెప్పుడో తెలియడం లేదు. గత టిడిపి ప్రభుత్వ హయాంలో 300 మీటర్లు పొడవు కలిగిన పనులకు రూ.29 కోట్లతో ప్రతిపాదనలు అందజేసిన సంగతి తెలిసిందే. కరోనా విజృంభణ నేపథ్యంలో రాష్ట్ర నీటిపారుదల శాఖ మొగమూరు అక్టిడక్ట్‌ నిర్మాణ పనులపై హైపవర్‌ కమిటీని ఏర్పాటు చేసింది. హైవపర్‌ కమిటీ మొగమూరుకు సంబంధించిన పౌండేషన్లను తనిఖీ చేసి, సిఇసిడిఒ డ్రాయింగ్‌ అప్రూవ్‌ తీసుకుని నిర్మాణ పనులు చేపట్టాలని సిఫారసు చేసింది. సిఇసిడిఒ ఇంజినీరింగ్‌ విభాగం డ్రాయింగ్‌ నివేదికను సైతం అందజేసింది. మొగమూరు అక్విడక్ట్‌ నిర్మాణాన్ని 1,100 మీటర్లు పొడువు, 3,000 నుంచి 5,000 క్యూసెక్కుల నీటి ప్రవాహం, 2,000 క్యూసెక్కుల డిశ్చార్జి సామర్థ్యంతో కూడిన నిర్మాణ పనులు చేపట్టాలని సూచించింది. ప్రభుత్వం ఫేజ్‌-2లోని ప్యాకేజీ-1 41.535 కి.మీ దగ్గర నుంచి రెండవ ప్యాకేజీలో కొంతమేర 1,100 మీటర్ల మేర అక్విడక్ట్‌ నిర్మాణాన్ని చేపట్టాలని ఆదేశించింది. ఎస్టిమేషన్‌ ప్రతిపాదనలు అందజేయాలని కోరింది. జిల్లా నీటిపారుదల శాఖ ఇంజినీర్లు రూ.256 కోట్లతో కూడిన రివైజ్డ్‌ ప్రతిపాదనలు అందజేసింది. ప్రభుత్వ ఆమోదం అనంతరం సాంకేతిక, పరిపాలనాపరమైన అనుతులు లభించిన వెంటనే టెండర్లు పిలిచేందుకు సిద్ధమైంది. 2024 సార్వత్రిక ఎన్నికలు తరుముకొచ్చిన నేపథ్యంలో అక్విడక్ట్‌ నిర్మాణ పనుల ప్రక్రియ పురోగతిపై సందేహాలు నెలకొనడం ఆందోళన నెలకొంది. ఏదేమైనా జిఎన్‌ఎస్‌ఎస్‌ పనుల పురోగతికి ప్రధాన అడ్డంకిగా మారిన మొగమూరు అక్విడక్ట్‌ నిర్మాణ పనుల్ని పూర్తి చేసి 56 కిలోమీటరు వద్ద కలిపితే ఆశించిన ఫలితం లభించే అవకాశం ఉంది. ఫలితంగా మొగమూరు నుంచి పాపాఘ్ని మీదుగా అలవలపాడు తదితర చెరువులు సహా మిగిలిన జిఎన్‌ఎస్‌ఎస్‌ ప్యాకేజీలకు నీటిని అందించే అవకాశం ఉంది. లేనిపక్షంలో దిగువ ప్రాంతంలోని 35 వేల ఎకరాలకు సాగునీరు అందడం ప్రశ్నార్థకంగా మారనుంది.రూ.256 కోట్లతో ప్రతిపాదనలు మొగమూరు అక్విడక్ట్‌ నిర్మాణ పనులకు రూ.256 కోట్లతో కూడిన ప్రతిపాదనలు అందజేశాం. ప్రభుత్వ ఆమోదం, సాంకేతిక, పాలనాపరమైన అనుమతులు లభించిన వెంటనే నిర్మాణ పనులు చేపడతాం.- ఎం.మల్లికార్జునరెడ్డి, జిఎన్‌ఎస్‌ఎస్‌ ఎస్‌ఇ, కడప.

➡️