యోగా, వ్యాయామం పట్ల శిక్షణ

కార్యక్రమంలో పాల్గొన్న రాణి తదితరులు

ప్రజాశక్తి-మండపేట

స్థానిక వాసవి కన్యకా పరమేశ్వరి ఫంక్షన్‌ హల్లో ఆడుదాం ఆంధ్రాలో కార్యక్రమంలో భాగంగా యోగా కార్యక్రమాన్ని మున్సిపల్‌ కమిషనర్‌ టి.రామ్‌ కుమార్‌ అధ్యక్షతన ఆదివారం నిర్వహించారు. మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ పతివాడ నూక దుర్గారాణి ముఖ్యఅతిథిగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మండపేట పట్టణానికి చెందిన యోగా గురువులు శ్రీనివాస్‌ యోగా ఆసనాలు, వ్యాయామాలు పట్ల అవగాహన కలిగించి శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్‌ ఎఇలు కెవివి.సత్యనారాయణ, పవన్‌, పట్టణ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

 

 

➡️