రక్తదానం ప్రాణదానంతో సమానం

ప్రజాశక్తి-దర్శి : రక్తదానం ప్రాణదానంతో సమానమని, ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ఇతరుల ప్రాణాలు కాపాడాలని జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌బూచేపల్లి వెంకాయమ్మ, వైసిపి దర్శి నియోజకవర్గ ఇన్‌ఛార్జి, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి తెలిపారు. స్థానిక డిగ్రీ కళాశాలలో రెడ్‌క్రాస్‌ సొసైటీ ఆధ్వర్యంలో మంగళవారం రక్తదాన శిబిరం నిర్వహించారు. రక్తదాన శిబిరాన్ని పరిషత్‌ బూచేపల్లి వెంకాయమ్మ, శివప్రసాద్‌రెడ్డి పారంభించారు. ఈ సందర్భంగా 52మంది రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో బూచేపల్లి నందిని, సొసైటీ చైర్మన్‌ రమేష్‌, వైస్‌ చైర్మన్‌ హరి, వైస్‌ ఎంపిపి సోము దుర్గారెడ్డి, కళాశాల ప్రిన్సిపల్‌ సావిత్రి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. 0

➡️