రక్తదానానికి యువతను ప్రోత్సహించండి

 మాట్లాడుతున్న మంత్రి అంబటి రాంబాబు

 సత్తెనపల్లి టౌన్‌: ఈ నెల 21న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ 51వ పుట్టినరోజును పురస్కరించుకొని నియోజకవర్గ స్థాయిలో రెడ్‌క్రాస్‌ వైసిపీల ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న మెగా రక్త దాన శిబిరన్ని విజయవంతం చేయాలని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ఆదివారం స్థానిక వైసిపి కార్యాలయంలో నాలుగు మండలాల నాయకులతో మాట్లాడారు. గత ఏడాది 836 మంది రక్తదానం చేయగా ఈ ఏడాది వెయ్యిమంది రక్తదానం చేసేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. ఇందు కోసం యువత ముందుకు వచ్చేలా వారిలో చైతన్యం కల్గించాలని చెప్పారు. ఒక్క వ్యక్తి ఇచ్చే రక్తదానంతో ముగ్గురు ప్రాణాలు కాపాడవచ్చనే విషయాన్ని యువతకు చెప్పాలని అన్నారు. కార్యక్రమంలో నాయ కులు పక్కాల సూరిబాబు, మర్రి సుబ్బారెడ్డి, చంద్ర మౌళి, ఆర్‌.పురుషోత్తం, నక్క శ్రీను, ఏంజెఆర్‌ లింగారెడ్డి, ఎస్‌.గోపాలరావు, ఆర్‌ వెంకటేశ్వరరెడ్డి, సొసైటీ చైర్మన్‌ సాయిరెడ్డి, ఎఎంసి చైర్మన్‌ అంజిరెడ్డి, ఎ.శివప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️