రహదారి పూర్తి చేయాలని నిరసన

Dec 23,2023 21:37

 ప్రజాశక్తి-వీరఘట్టం  :  వీ రఘట్టం ప్రధాన రహదారి పనులు పూర్తి చేయాలని శనివారం టిడిపి, జనసేన ఆధ్వర్యంలో రోడ్డుపై నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి నిమ్మక జయకృష్ణ మాట్లాడుతూ వీరఘట్టం ప్రధాన రహదారి పనులు చేపట్టి మూడేళ్లు కావస్తున్నా పూర్తి కాలేదంటే పాలకుల పనితీరు ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. ప్రతిరోజూ వందలాది భారీ వాహన రాకపోకల వల్ల దుమ్ము, ధూళి ఎగరడంతో స్థానికులు రోగాల బారిన పడుతున్నట్లు తెలిపారు. నిమ్మక నిబ్రం మాట్లాడుతూ రహదారి పనులు పూర్తి చేయకపోతే రానున్న రోజుల్లో మరిన్ని ఆందోళనలు చేస్తామన్నారు. కార్యక్రమంలో మండల అధ్యక్షులు ఉదయాన ఉదయభాస్కర్‌, పట్టణ అధ్యక్షులు జామి లక్ష్మీనారాయణ, మండల ప్రధాన కార్యదర్శి చింత ఉమామహేశ్వరరావు, ఎన్‌.శశికుమార్‌, జనసేన నాయకులు ఎం.పుండరీకం, వజ్రగడ జానీ, కె.సాయి పవన్‌, బి.నీలకంఠంనాయుడు, వై.అప్పల నాయుడు, బి.హరిబాబు, టి.రమేష్‌, డి.రాజు పాల్గొన్నారు.

➡️