రహదారులు దిగ్బంధం

తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలంటూ అన్నమయ్య జిల్లాలో అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు చేపట్టిన నిరవధిక సమ్మె శుక్రవారం నాటికి 11వ రోజుకు చేరుకుంది. జిల్లా వ్యాప్తంగా ఉన్న ఐసిడిఎస్‌, తహశీల్దార్‌, ఎంపిడిఒ కార్యాలయాల ఎదుట అంగన్వాడీలు పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగిస్తూనే రహదారులపై బైటాయించి రాస్తారోకోలు నిర్వహించారు. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతయారం ఏర్పడింది. కొన్ని చోట్ల రాస్తారోకోను నిర్వహించకుండా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీసుల ఆంక్షలను లెక్కచేయకుండా అంగన్వాడీలు తమ నిరసనను కొనసాగించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంగన్వాడీల సమ్మెకు పార్టీలు, ప్రజలు, ప్రజా సంఘాల నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తోంది. ప్రజాశక్తి – రాయచోటి టౌన్‌ ప్రభుత్వం అంగన్వాడీల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న ద్వంద్వ వైఖరి వీడి కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ. రామాంజులు, అంగన్వాడీ యూనియన్‌ జిల్లా వర్కింగ్‌ ప్రసెడెంట్‌ డి.భాగ్య లక్ష్మి పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక చెక్‌పోస్ట్‌ శివాలయం వద్ద చిత్తూరు, మదనపల్లి మూడు రోడ్ల సర్కిల్‌లో జాతీయ రహదారిపై భారీ రాస్తా రోకో నిర్వహించారు. ప్లేట్లు, గ్లాసులు కొడుతూ ప్రభుత్వానికి తమ నిరసనను వినూత్నంగా తెలియజేశారు. జాతీయ రహదారిపై సుమారు గంటకు పైగా రాకపోకలు నిలిచిపోయాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం అంగన్వాడీల సెంటర్ల తాళాలు పగలకొట్టమని సచివాలయ ఉద్యోగుల చేత చేయిస్తూ మరో వైపు సమస్యల పరిష్కారానికి సానుకూలం అంటూ చెప్పడం సరైంది కాదన్నారు. అంగన్వా డీలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి ఉషశ్రీ చరణ్‌, ఫుడ్‌ కమిషన్‌ చైర్మన్‌ చిత్తా విజరు ప్రతాప్‌రెడ్డి తక్షణమే క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. మంత్రి బొత్స సత్యనారాయణ అంగన్వాడీలు విధులకు హాజరు కావాలని, మూడు నెలల్లో సమ స్యలను పరిష్కారం చేస్తామం టూనే వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులకు ఐసిడిఎస్‌ విధుల నిర్వహణ నిమిత్తం డబ్బులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నార న్నారు. నిత్యం కష్టపడే అంగన్వాడీలకు డబ్బులుండవా అని ప్రశ్నించారు. లబ్దిదారులకు ప్రభుత్వం మీద వ్యతిరేకత తగ్గించడానికి హడావుడిగా సిబ్బందిని సమకూర్చే పని చేస్తోందని తద్వారా ప్రీస్కూల్‌ నిర్వాహణ దెబ్బతింటోందన్నారు. పిల్లల ఆలనా పాలనా చూడడం అంగన్వాడీలకు తప్ప మరెవ్వరూ చూడలేరని తెలిపారు. సచివాలయ సిబ్బంది అంగన్వాడీల సెంటర్లలో క్రికెట్‌ ఆడుతున్నారని విమర్శించారు. మంత్రులు అధికారులు చౌకబారు దుష్ప్రచారం మాని అంగన్వాడీల న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి చొరవ చూపాలన్నారు. అంగన్వాడీల సమస్యల పరిష్కార పోరాటాలకు సంపూర్ణ సహకారం అందిస్తామని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి నరసింహ, కెవిపిఎస్‌ జిల్లా కో-కన్వీనర్‌ డి.వెంకటయ్య పేర్కొన్నారు. కార్యక్రమంలో అంగన్వాడీలు బంగారుపాప, సిద్దమ్మ, విజయ, సుమలత, రమణమ్మ, పద్మజ, నాగమణి, ప్రవీణ, లక్ష్మీదేవి, అరుణ, జలజ పాల్గొన్నారు. రాజంపేట అర్బన్‌: ఐసిడిఎస్‌ కార్యాలయం వద్ద ఉరితాళ్లతో వినూత్నంగా నిరసన తెలిపారు. కార్యక్ర మంలో సిఐటియు జిల్లా ఉపా ధ్యక్షులు చిట్వేలి రవికుమార్‌, ఎఐటియుసి పట్టణ కార్యదర్శి సికిందర్‌, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి పి.మహేష్‌, ఎఐటియుసి జిల్లా ఉపాధ్యక్షులు రాయుడు, ఏరియా కార్యదర్శి శివరామకృష్ణ దేవర, అంగ న్వాడీలు రమాదేవి, సుజాత, ఈశ్వరమ్మ, శివరంజని, విజయ, అమరావతి పాల్గొన్నారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఈశ్వరయ్య మద్దతు తెలిపారు. జనసేన నియోజకవర్గ ఇన్‌ఛార్జి మలిశెట్టి వెంకటరమణ ఆధ్వర్యంలో అంగన్వాడీలు భోజన వసతి కల్పించారు. కార్యక్రమంలో జనసేన చేనేత వికాస రాష్ట్ర కార్యదర్శి రాటాల రామయ్య, వీర మహిళలు రజిత, అబ్బిగారి గోపాల్‌, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొ న్నారు. బి.కొత్తకోట : అంగన్వాడీలు తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరిం చాలని బి.కొత్తకోట, పెద్దతిప్పసముద్రం మొలకలచెరువు మండలం అంగ న్వాడీలు తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. రైల్వేకోడూరు: మంత్రి ఉషశ్రీ చరణ్‌ అంగన్వాడీలపై చేసిన వ్యాఖ్యలకు వెంటనే క్షమాపణ చెప్పాలని స్థానిక టోల్గేట్‌ సెంటర్‌ వద్ద రాస్తారోకో చేపట్టి మానవహారం నిర్వహిం చారు. కార్యక్రమంలో యూనియన్‌ జిల్లా అధ్యక్షులు ఎస్‌.శ్రీలక్ష్మి, రైల్వేకోడూరు ప్రాజెక్ట్‌ అధ్యక్షలు ఎన్‌.రమాదేవి, ప్రాజెక్ట్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ టి.రాధా కుమారి, కోశాధికారి జి.పద్మావతి, గౌరవ అధ్యక్షులు డి.వనజ కుమారి, సెక్టార్‌ లీడర్స్‌ లీలావతి, దుర్గ, శిరీష, మునీంద్ర, ఈశ్వరమ్మ, సుజాత, బి.వాణి, వి.స్వర్ణలత, వై.మణెమ్మ, చెంచులక్ష్మి, రాధా, నాగలత, ప్రసన్నకుమారి, సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్‌ చంద్రశేఖర్‌, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు జాన్‌ ప్రసాద్‌ పాల్గొ న్నారు. పీలేరు: స్థానిక జాతీయ రహదారిపై అంగన్వాడీలు రాస్తారోకో నిర్వహిం చారు. కార్యక్రమంలో పీలేరు, కెవి పల్లి, కలకడ మండలాల అంగన్వాడీలు, సిఐ టియు, ఎఐటియుసి నాయకులు వెంకట్రామయ్య, టిఎల్‌ వెంకటేష్‌, నరసిం హులు పాల్గొన్నారు. మదనపల్లి: స్థానిక ఐసిడిఎస్‌ కార్యాలయం వద్ద నుండి ర్యాలీ నిర్వహించి, అనంతరం సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం వద్ద రోడ్డుపై ధర్నా చేశారు. కార్యక్రమంలో నాయకులు తెలకపల్లి హరింద్రనాథ్‌ శర్మ, ప్రభాకర్‌ రెడ్డి, మధురవాణి, రాజేశ్వరి, గౌరీ, కరుణ, స్వారూపా, భూకైలేశ్వరి, అమ్మాజీ, విజయ, అఖిరున్నిసా, బాగ్యా, గీతా సుజాని, శ్రీవాణి, ఈశ్వరి పాల్గొన్నారు. సమ్మెకు ఆశా కార్యకర్తల యూనియన్‌ నాయకులు శోభారాణి, సబిత, కౌలు రైతు సంఘం కార్యదర్శి రమేష్‌ బాబు సంఘిభావం తెలిపారు. తంబళ్లపల్లె: తంబళ్లపల్లె, పెద్దమండ్యం, కురబలకోట మండలాలలోని అంగన్వాడీలు ఐసిడిఎస్‌ కార్యాలయం నుండి రాగి మాను రచ్చ వరకు ర్యాలీ చేశారు. కార్యక్రమంలో యూనియన్‌ లీడర్లు కరుణశ్రీ, సులోచన, గౌరీలు కోరారు.

➡️