రాజకీయ నిర్ణయం తీసుకుంటాం : విటపు

Jan 31,2024 19:22
మాట్లాడుతున్న ఎంఎల్‌సి విటపు బాలసుబ్రమణ్యం

మాట్లాడుతున్న ఎంఎల్‌సి విటపు బాలసుబ్రమణ్యం
రాజకీయ నిర్ణయం తీసుకుంటాం : విటపు
ప్రజాశక్తి-నెల్లూరురాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోకపోతే రాజకీయ నిర్ణయం తీసుకుంటామని మాజీ ఎంఎల్‌సి విఠపు బాలసుబ్రహ్మణ్యం స్పష్టం చేశారు. బుధవారం యుటిఎఫ్‌రాష్ట్ర శాఖ పిలుపు మేరకు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ఎదుట రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ దీక్షా శిభిరానికి ముఖ్యఅతిధిగా హాజరైన మాజీ ఎంఎల్‌సి విఠపు బాలసుహ్మ్రణ్యం మాట్లాడుతూ డబ్బులకు, బడ్జెట్‌కు ఎటువంటి సంబంధం లేదని, ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలన్న ఆలోచన ప్రభుత్వం చేయడం లేదన్నారు. ఉపాధ్యాయ సంఘం యుటిఎఫ్‌ ప్రారంభించిన పోరాటాన్ని ఆదర్శంగా తీసుకోని మిగత ప్రభుత్వ రంగాల ఉద్యోగులను కూడగట్టుకోని రాజకీయ నిర్ణయం తీసుకోని రానున్న ఎన్నికల్లో ఈ ప్రభుత్వానికి తగిన బుద్ది చెప్పతామని హెచ్చరించారు. యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి ఎన్‌.నవకోటేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నాలుగు రోజుల నిరాహార దీక్షలల్లో భాగంగా మొదటి రోజు దీక్షలు ప్రారంభించామన్నారు. అధికారం కోసం హామీలు ఇచ్చిన పాలకులు అధికారంలోకి వచ్చిన తరువాత వాటిని విస్మరించడం సరికాదన్నారు. పాఠశాలలను విలీనం చేస్తున్నామన్న పేరుతో విద్యావ్యవస్థను దెబ్బతీసిందని, సిపిఎస్‌ రద్దు చేస్తామని నమ్మకంగా హామీలు చేసి కుట్రపూరితంగా వ్యవహరిస్తూ జిపిఎస్‌ తీసుకురావడం దుర్మార్గమన్నారు. రివర్స్‌ పిఆర్‌సి, హెచ్‌ఆర్‌ఏ తగ్గింపు, 11వ పిఆర్‌సి అరియర్స్‌ ఇప్పటికి ఉపాధ్యాయలుకు అందజేయకపోగా ప్రస్తుత ప్రభుత్వం ఉపాధ్యాయ, ఉద్యోగులు దాచుకున్న సోమ్మును సైతం స్వాహా చేయడం దారుణమన్నారు. ఉపాధ్యాయులకు సంబంధించిన పిఆర్‌సి అరియర్స్‌, డిఏ అరియర్స్‌, పిఎఫ్‌, ఏపిజిఎల్‌ఐ,సరెండర్‌ లీవు, అరియర్స్‌ చెల్లించక పోతే జిల్లాలో 4రోజుల రిలే నిరాహార దీక్షల అనంతరం మరో పోరాటం చేపట్టడం తధ్యమన్నారు. యుటిఎఫ్‌ పూర్వ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.బాబురెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయులు దాచుకున్న సోమ్ము కోసం పోరాటం చేయడం రాష్ట్ర చరిత్రలో ఇప్పటి వరకు జరగలేదన్నారు. సమస్యలను పరిష్కరించడం చేతకాని ప్రభుత్వానికి ఉద్యోగులు చేస్తున్న పోరాటాన్ని అణిచివేయాలని ప్రయత్నాలు చేయడం మంచిది కాదన్నారు. ఎన్నికల సమయంలో ప్రకటించిన మోనిఫెస్టోలను భగవత్‌గీత, బైబిల్‌, కురాన్‌ వంటి గ్రంధాలతో పోల్చి దేవుళ్లను సైతం ఈ ప్రభుత్వం మోసం చేసిందన్నారు.ఉపాధ్యాయులు చేస్తున్న దీక్షా శిభిరానికి మాజీ మంత్రి, టిడిపి పోలిట్‌ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి హాజరై సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ రిలే దీక్షలకు అధ్యక్షత వహించిన యుటిఎఫ్‌ జిల్లా అధ్యక్షులు వి.వి.శేషులు మాట్లాడుతూ ఉద్యమం మరో రూపంలోకి మారక ముందే ప్రభుత్వం స్పందించి ఉద్యోగ, ఉపాధ్యాయులకు చెల్లించాల్సిన రూ.18096 కోట్ల ఆర్ధిక బకాయిలు వెంటనే చెల్లించాలన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి జి.వి.చలపతి శర్మ మాట్లాడుతూ గడిచిన 5 ఏళ్లుగా ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారించక ప్రభుత్వం పరీక్ష తప్పిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహాద్యక్షులు ఎం.సి అచ్చయ్య, జిల్లా కోశాధికారి ఎ.మురళీధరరావు, జిల్లా కార్యదర్శులు ఎన్‌.మధుసూధనరావు, ఎన్‌ సురేంద్రబాబు, జి.దయాకర్‌, పూర్వ కార్యదర్శి ఎస్‌కె షాజిద్‌, రాష్ట్ర కౌన్సిలర్‌ కె.తులసీరాంబాబు, ప్రాంతీయ మండల అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు ,ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

➡️