రాజ్యాంగం పీఠికతోనే ప్రజలకు స్వేచ్చా

Nov 26,2023 20:30
ప్రతిజ్ఞ చేస్తున్న దృశ్యం

ప్రతిజ్ఞ చేస్తున్న దృశ్యం
రాజ్యాంగం పీఠికతోనే ప్రజలకు స్వేచ్చా
ప్రజాశక్తి-నెల్లూరు భారతదేశం ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా నిల బడిందంటే దానికి కారణం భారత రాజ్యాంగమేనని, భారతదేశ ప్రజలు స్వేచ్ఛా స్వాతంత్య్రాలతో జీవించడానికి రాజ్యాంగం పీఠికలో పేర్కొన్న అంశాలే ప్రధాన కారణమని జాయింట్‌ కలెక్టర్‌ ఆర్‌. కూర్మనాథ్‌ పేర్కొన్నారు. ఆదివారం కలెక్టరేట్లోని ఎస్‌.ఆర్‌. శంకరన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ హాలులో భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా జాయింట్‌ కలెక్టర్‌ ఆర్‌. కూర్మనాథ్‌ రాజ్యాంగ దినోత్సవ ప్రాధాన్యతను వివరించి, అధికారులతో రాజ్యాంగ పీఠిక ప్రతిజ్ఞ చేయించారు. ఈ సంధర్భంగా జాయింట్‌ కలెక్టర్‌ మాట్లాడుతూ ఈ రోజు భారత రాజ్యాంగాన్ని ఆమోదించుకున్న రోజు అని, 2015 నుంచి ప్రతి సంవత్సరం నవంబర్‌ 26వ తేదీన భారత రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకోవాలని ప్రభుత్వం తీర్మానిస్తూ గజిట్‌ రూపంలో ప్రచురించడం జరిగిందని, అప్పటి నుండి నవంబర్‌ 26నా భారత రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించుకోవడం జరుగుచున్నదన్నారు. భారత రాజ్యాంగ విశిష్టతను ఒక సారి మనం చూసుకున్నట్లయితే ప్రపంచ రాజ్యాంగాల్లోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగమని అన్నారు. మన రాజ్యాంగంలో పొందుపర్చబడిన అంశాల ఆధారంగా రాజ్యాంగ పరంగా మనమంతా స్వేచ్చాయుత వాతావరణంలో ప్రశాంతంగా జీవిస్తున్నామన్నారు.

➡️