రాముడి పేరుతో మత రాజకీయాలు

మాట్లాడుతున్న గంజి మాల రవిబాబు

అమరావతి: మత రాజకీయాల ద్వారా మూడోసారి అధికారంలోకి బిజెపి రావాలనే ఉద్దేశ్యంతో రామా లయం పేరిట వ్యక్తిగత విశ్వాసాన్ని, రాజకీయాలతో ముడివేసే ప్రయత్నాలను ఆర్‌ఎస్‌ఎస్‌ చేస్తోందని పల్నాడు జిల్లా సిపిఎం కార్యదర్శి వర్గ సభ్యులు గంజి మాల రవిబాబు విమర్శించారు. ఈ నేపథ్యం లోనే అయోధ్యలో రామాలయం పేరుతో మత సామరస్యాన్ని దెబ్బతీసే విధంగా నరేంద్ర మోడీ ,అధికార వ్యవస్థను మత రాజకీయాలలో కలుషితం చేస్నున్నారన్నారు. ఆదివారం అమరావతిలో జరి గిన సిపిఎం సమావేశంలో రవిబాబు మాట్లాడుతూ లౌకికత్వాన్ని రాజ్యాంగంలో పొందుపరిస్తే రాజ్యాంగ విలువలను నరేంద్ర మోడీ నాశనం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రపతిని రామాలయ ప్రారం భోత్సవానికి ఆహ్వానించకపోవడం దుర్మార్గమన్నారు. దేశంలో నిరుద్యోగ సమస్యను, రైతుల ఆత్మహత్య ల గురించి నరేంద్ర మోడీ పట్టించుకోవట్లేదని అన్నారు. మరోపక్క నిత్యావసరాల ధరలు పెరిగిపోతున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదని ధ్వజ మెత్తారు. ఆంధ్రప్రదేశ్‌కి అన్యాయం చేసిన బిజెపితో రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలు పొత్తుల కోసం వెంపర్లాడుతున్నాయని మండిపడ్డారు. విభ జన హామీలు అమలు చేయనందున, కేంద్రం నుంచి నిధులు రానందున రాష్ట్ర అభివృద్ధి కుంటుపడిందని అన్నారు. రాష్ట్ర ప్రజల కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రధాన రాజకీయ పార్టీలు కేంద్ర ప్రభుత్వంపై పోరాడకుండా వైసిపి అధికారాన్ని ఏ విధంగా నిలబెట్టుకోవాలని దశలవారీగా బిజెపికి మద్దతిస్తా మనడం, రాష్ట్రానికి ద్రోహం చేసినట్టు కాదా అని ప్రశ్నించారు. అధికారంలోకి రావడానికి టిడిపి, జనసేనలు బిజెపితో చేతులు కలపడం రాజకీయ కపట నాటకానికి నిదర్శమని అన్నారు. లౌకిక తత్వం, సమగ్రత, రాజ్యాంగ పరిరక్షణ కోసం నిక రంగా దేశ వ్యాప్తంగా బిజెపి వ్యతిరేక శక్తుల్ని కలుపు కొని సిపిఎం పోరాటం నిర్వహిస్తుందని అన్నారు. ఏపీలో కూడా బిజెపి వ్యతిరేక శక్తులను కలుపుకొని రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం కృషి చేస్తుందని చెప్పారు. సమావేశంలో సిపిఎం పార్టీ కార్యదర్శి బి సూరిబాబు,సయ్యద్‌ మొహిద్దిన్‌ వలి,ఎం.సుబ్ర హ్మణ్యం, వెంకటేశ్వరరాజు, నాగుల్‌ మీరా, కృష్ణ పాల్గొన్నారు.

➡️