రాయచోటిపై మైనార్టీల గురి

ప్రజాశక్తి – రాయచోటి టౌన్‌ అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయ చోటి అసెంబ్లీకి మైనార్టీ నాయ కులు పోటీ చేయాల నుకుంటున్న వారి సంఖ్య రోజురోజుకూ పేరుగు తోంది. రాయచోటి సుగవాసి, మండిపల్లి కుటుం బాలకు పట్టు కలిగిన నియోజకవర్గం. 2004 తర్వాత నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా లక్కిరెడ్డిపల్లి నియోజ కవర్గం తొలగిచడంతో ఇక్కడ పట్టు కలిగిన రెడ్డప్ప, గడికోట కుటుంబాలు రాయ చోటి నియోజకవర్గంలో కలిసిపోయాయి. ప్రధాన పార్టీల తరఫున ఆ రెండు కుటుంబాలదే ఆధిపత్యం కోనసాగుతోంది. ముస్లిం మైనార్టీలు వైసిపి నుంచి పోటిచేయాలని భావిస్తున్నప్పటికీ వరుసగా నాలుగు సార్లు విజయం సాధించిన సిట్టింగ్‌ ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి ఆ పార్టీకి గెలుపు గుర్రం కావడంతో ఆయనకు తప్ప మరొకరికి ఛాన్స్‌ ఉండదని నిశ్చయించుకున్న మైనార్టీలు చంద్రబాబు నాయుడు చుట్టూ టిడిపి టికెట్‌ కోసం చక్కర్లు కొడుతున్నారు. రాయచోటిలో విజయాన్ని ప్రభావితం చేసే ప్రాంతం పట్టణంలోని ఈస్ట్‌ ప్రాంతం. ఈ ప్రాం తంలోని ఎక్కువగా ముస్లిం మైనార్టీలు ఉండటం వందశాతం పోలీంగ్‌ బూత్‌కు వెళ్లి ఓటు హక్కును వినియొగించుకొన్నవారు ఉండటంతో ఈ ప్రాంతమే గెలుపును డిసైడ్‌ చేస్తాయి. దాని తర్వాత ఈ ప్రాంతాల్లో రెడ్డి సామాజిక వర్గం ఉన్నప్పటికీ వారు చాలా వరకు బిజెపి పోటీ చేసే ఆభ్యర్థులకు అంతర్గతంగా సహకరిస్తారని, లేదా పోలింగ్‌ బూత్‌ వైపు కన్నెత్తి చూడరనే వాదనలు వినిపి స్తున్నాయి. నియోజకవర్గ వ్యాప్తంగా ఒసి, బిసి లలో మైనార్టీలు 65 శాతం ఒటర్లు ఉండటం వారు కచ్చితంగా ఓటు హక్కును వినియెగించుకొంటుడంతో ఆభ్యర్థుల గెలుపోట ములు వారే డిసైడ్‌ చేస్తారు. ప్రస్తుతం టిడిపి టికెట్‌ కోసం టిడిపి ఇన్‌ఛార్జిగా ఉన్న రమేష్‌ కుమార్‌రెడ్డి, మాజీ టిటిడి బోర్డు సభ్యుడు ప్రసాద్‌ బాబు, మాజీ పిసిసి సభ్యుడు రాంప్రసాద్‌రెడ్డి పోటీ పడుతు న్నారు. ఈ ముగ్గురు నాయకుల గ్రాఫ్‌ను పరిశీలిస్తే రమేష్‌రెడ్డి 1999 ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిగా లక్కిరెడ్డిపల్లి ఎమ్మెల్యేగా గెలిచారు. 2004లో లక్కిరెడ్డిపల్లి టిడిపి ఆభ్యర్థిగా, 2009లో రాజంపేట టిడిపి ఎంపీ ఆభ్యర్థిగా, 2014, 2019లో రాయచోటి టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థిగా వరుసగా 20 ఏళ్లుగా జరిగిన నాలుగు ఎన్నికల్లో సైతం ఒటమిని మూటగట్టుకున్నారు. ఇక సుగవాసి కుటుంబం నుంచి చేప్పుకోవాలంటే 2004 చివరిసారిగా సుగవాసి పాలకొండ్రాయుడు ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో గడికోట శ్రీకాంత్‌రెడ్డిపై పోటీ చేసి ఓడిపోవడంతో 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో టిడిపి సుగవాసి పాలకొండ్రాయుడు తన యుడు, జడ్‌పి మాజీ వైస్‌ చైర్మన్‌ సుగవాసి బాలసుబ్రమణ్యం టిడిపి ఆభ్యర్థిగా పోటిచేసి గడికోట శ్రీకాంత్‌రెడ్డితో ఒటమిని చవిచుశారు. టిడిపి అధిష్టానం సుగవాసి కుటుంబాన్ని పక్కన పెట్టేసింది. రెడ్డప్ప కుటుంబానికి ఆవకాశం కల్పిస్తూ వచ్చింది. ఇక మండిపల్లి కుటుంబం నుంచి చేప్పాల్సివస్తే 1995లో మండిపల్లి నారాయణరెడ్డి విజయం సాధించారు. 1999లో మండిపల్లి నారాయణరెడ్డి, పాలకొండ్రాయుడుపై పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2004 మండిపల్లి కుటుంబానికి చెందిన శ్రీలత, పాలకొండ్రాయుడుపై పోటీ చేసి ఓటమిని చవిచుశారు. 2012లో జరిగిన ఉపఎన్నికల్లో మండిపల్లి రాంప్రసాద్‌ కాంగ్రెస్‌ తరపున, 2014 ఎన్నికల్లో జై సమైక్యాంధ్ర తరఫున పోటీ చేసి ఓటమిని మూటగట్టుకొన్నారు. వరుస ఓటములను చవిచూసిన రెడ్డప్పగారి రమేష్‌ కుమార్‌ రెడ్డి, సుగవాసి కుటుంబం, మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధిస్తున్న ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డిపై విజయం సాధించడం ఆశామాసీ కాదని టిడిపి ఆధిష్టానం భావిస్తోంది. రమేష్‌ కుమార్‌ రెడ్డి నాలుగు సార్లు ఒడిపోవడం, రాంప్రసాద్‌రెడ్డి రెండు సార్లు ఒడిపోవడం, ప్రసాద్‌ బాబు వైసిపి ఆధికారంలోకి రాగానే మున్సిపల్‌ ఎన్నికల్లో వైసిపికి ప్రచారం చేయడం వంటి అంశాలపై అధ్యయనం చేసిన అధిష్టానం వారిని నమ్మడం లేదని రాయచోటి ముస్లిం మైనార్టీలు భావిస్తున్నారు. టిడిపి టికెట్‌ కోసం ముస్లిం మైనార్టీ సామాజిక వర్గానికి ఆరుగురు నాయకులు వేర్వేరుగా తమకు టికెట్‌ ఇవ్వాలని చంద్రబాబుకు కలిసి విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. వివిధ విషయాల్లో మైనార్టీల్లో శ్రీకాంత్‌రెడ్డి పట్ల అసంతప్తి ఉంది. వక్ఫ్‌ బోర్డు స్థలం స్వాధీన పరుచటలో విఫలమయ్యారని వంటి అనేక విషయాలను చంద్రబాబుతో మైనార్టీ నాయకులు చర్చించినట్లు తెలుస్తోంది. మైనార్టీలకు టికెట్‌ ఇస్తే వైసిపి కంచుకోటను బద్దలు చేయెచ్చనే వాదనను చంద్రబాబు బలంగా నమ్మినట్లు తెలుస్తోంది. ఇప్పటికే మైనార్టీలలో కాంగ్రెసు పార్టీ తరఫున 1972, 1978లలో హబీబుల్లా, ఆయన మరణం తర్వాత ఆయన సతీమణి షావరున్నిసా, 2014 లో ఇంతియాజ్‌, 2019లో అల్లాబకష్‌, టిడిపి తరపున 1985లో దాదా సాహెబ్‌, 2009లో ప్రజారాజ్యం తరఫున మహబూబ్‌ బాషా, 2019లో జనసేన తరఫున హసన్‌బాష రాయచోటి అసెంబ్లీ స్థానానికి పోటీ చేశారు. 1972 కాంగ్రెస్‌ ఆభ్యర్థి హబీబుల్లా మినహ మిగిలిన ఆరుగురు ఆభ్యరులు ఒటమిని చవిచుశారు. టిడిపి టికెట్‌ కేటాయించిన గెలుపు గుర్రం రేసులో ముందుంటారా…? వేనక బడతారా…అన్నది తేలుసుకోనేందుకు పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు శాసనమండలి మాజీ చైర్మన్‌ షరీఫ్‌ను రాయచోటి ముస్లిం సామాజిక రాజకీయ పరిస్థితులపై ఆరా తీయించారు. టిడిపి ఇన్‌ఛార్జి రమేష్‌ కుమార్‌రెడ్డి అధ్యక్షతన ముస్లిం మైనార్టీల ఆత్మీయ సదస్సు నిర్వహించారు. అయితే సదస్సుకు ముస్లిం టిడిపి అగ్రనేతలు వేదికపై కనపడ్డారే తప్ప వారి ప్రసంగం వినేందుకు ముస్లిం లేకపోవడం మరి విడ్డూరం. ఏదైనప్పటికి టిడిపి టికెట్‌ ముస్లిం మైనారిటీలకు ఇస్తారా లేక పాత వారికే ఇస్తారా అనేది వేచి చూడాలి

➡️