రాయదుర్గం మున్సిపల్‌ కమిషనర్‌గా షేక్‌ మాలిక్‌

Jan 30,2024 16:23 #anathapuram

ప్రజాశక్తి-రాయదుర్గం(అనంతపురం) : రాయదుర్గం మున్సిపల్‌ కమిషనర్‌గా షేక్‌ మాలిక్‌ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన కర్నూలు మున్సిపల్‌ కార్పొరేషన్‌ నుండి బదిలీపై ఇక్కడికి వచ్చారు. ఇదివరకు ఇక్కడ కమిషనర్‌గా పనిచేసిన దివాకర్‌ రెడ్డి నగరి పురపాలక సంఘానికి బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా కమిషనర్‌ షేక్‌ మాలిక్‌ మాట్లాడుతూ పురపాలక మండలి, మున్సిపల్‌ అధికారులు, సిబ్బంది, ప్రజల సహకారంతో పురపాలక సంఘం లో ప్రజలకు మౌలిక సౌకర్యాలు కల్పన, అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. గతంలో తాను మడకశిర, గుంతకల్లు తదితర ప్రాంతాలలో మున్సిపల్‌ కమిషనర్‌గా పనిచేసినట్లు తెలిపారు.

➡️