రాష్ట్రంలో నిరంకుశ పాలన : ఇమ్మడి

ప్రజాశక్తి – మార్కాపురం రూరల్‌ శ్రీపూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు, మార్కాపురం జిల్లా సాధనకై జనసేన పార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇన్‌ఛార్జి ఇమ్మడి కాశీనాథ్‌ చేపట్టిన పాదయాత్ర రెండో రోజు సోమవారమూ కొనసాగింది. ఈ పాదయాత్ర మండల పరిధిలోని యాచవరం, నాయుడుపల్లి, మన్నెవారిపల్లి, రాయవరం గ్రామాల్లో సాగింది. పాదయాత్రకు టిడిపి నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఇమ్మడి కాశీనాథ్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో నిరంకుశ పాలన సాగుతుందన్నారు. ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను ప్రశ్నిస్తే వారిపై అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపుతున్నట్లు విమర్శించారు. రాష్ట్ర ప్రజలందరూ వైసిపి అరాచక పాలన గమనిస్తున్నారని, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఇంటికి సాగనంపాలని ఆయన కోరారు. వైసిపి మళ్లీ అధికారంలోకి వస్తే పేదలు బతికే పరిస్థితి ఉండదని తెలిపారు. ఈ నేపథ్యంలో వైసిపిని ఇంటికి సాగనంపాలన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకుడు శాసనాల వీరబ్రహ్మం జనసేన పార్టీ నాయకులు, శ్రీ అల్లూరి పోలేరమ్మ తల్లి దేవస్థానం మాజీ చైర్మన్‌ బొందిలి కాశీరాం, సింగ్‌, సిరిగిరి శ్రీనివాసులు, విజయరావు, నరసింహారావు, పిన్నిబోయిన శ్రీనివాసులు, గుంటూ రత్నకుమార్‌, డి. చంద్రశేఖర్‌, ఓర్సు శంకరయ్య, జి.శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు

➡️