రాష్ట్రవ్యాప్తంగా మహారాజా కోఆపరేటివ్‌ అర్బన్‌ బ్యాంకు సేవలు

మహారాజా కోఆపరేటివ్‌ అర్బన్‌ బ్యాంకు

ప్రజాశక్తి- సీతమ్మధార: రాష్ట్రంలో ఉత్తర కోస్తాలోని ఉమ్మడి ఆరు జిల్లాల్లోనే ఉన్న మహారాజా కోఆపరేటివ్‌ అర్బన్‌ బ్యాంకు సేవలను రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలని ప్రత్యేక మహాజన సభలో ఏకగ్రీవంగా ఆమోదించారు. ఆదివారం సీతమ్మధార క్షత్రియ సంక్షేమ సమితిలో నిర్వహించిన బ్యాంకు మహాజన సభలో బ్యాంకు వ్యవస్థాపక అధ్యక్షులు ఎం. రామకృష్ణంరాజు మాట్లాడుతూ ప్రస్తుతం శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కష్ణ ఉమ్మడి జిల్లాల్లోనే అందుబాటులో ఉన్న బ్యాంకు సేవలను రాష్ట్రంలోని 26 జిల్లాలకు విస్తరించేలా బ్యాంకు మార్గదర్శకాలు(బైలా-3) సవరణ ప్రతిపాదనలకు మహాజనసభ ఏకగ్రీవంగా ఆమోదించడంపై హర్షం వ్యక్తం చేశారు. 24ఏళ్ల క్రితం ద్వారకానగర్‌లో ప్రారంభించిన బ్యాంకును గాజువాక, బుచ్చిరాజుపాలెం, మధురవాడ, ఎంవిపి కాలనీ, సుజాతనగర్‌, కాకినాడ భానుగుడి జంక్షన్‌ ఇలా ఏడు శాఖలు, నాలుగు ఎటిఎంలు, 10 మంది బోర్డు ఆఫ్‌ డైరెక్టర్లు, ఆరుగురు బోర్డు ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ సభ్యులు, లీగల్‌ అడ్వైజర్లు, ఆడిట్‌ సలహాదారులు, 75 మంది సిబ్బందితో అభివృద్ధి పథంలో సాగుతోందన్నారు. 2017లో టైర్‌-2బ్యాంకుగా ఉన్న మహారాజా కోఆపరేటివ్‌ అర్బన్‌ బ్యాంకు ప్రస్తుత ఆర్థికసంవత్సరంలో రూ.257.57 కోట్లు డిపాజిట్లు, రూ.176.61 కోట్లు రుణాలు కలిగి ఉన్నామన్నారు. వచ్చే ఫిబ్రవరి, మార్చిలో కూర్మన్నపాలెంలో నూతన శాఖను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు కార్యక్రమంలో బ్యాంకు డైరెక్టర్లు జి. బంగార్‌రాజు, ఎంవిఎస్‌జెడ్‌ ఎస్‌ఆర్‌కె.వర్మలను సత్కరించారు. బ్యాంకు జనరల్‌ మేనేజర్‌ ఎస్‌ఎస్‌. సత్యనారాయణ, 250మంది సభ్యులు పాల్గొన్నారు.మహారాజా కోఆపరేటివ్‌ అర్బన్‌ బ్యాంకు

మాట్లాడుతున్న రామకృష్ణంరాజు

➡️