రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు పాకల విద్యార్థినులు

ప్రజాశక్తి-శింగరాయకొండ : రాష్ట్రస్థాయి జూనియర్‌ బాలికల కబడ్డీ జట్టుకు శింగరాయకొండ మండలం పాకల జిల్లా పరిషత్‌ హైస్కూల్‌ చెందిన ఏడుగురు విద్యార్థినులు ఎంపికైనట్లు వ్యాయామ ఉపాధ్యాయులు పి. హజరత్తయ్య తెలిపారు.కె.నందిని, కె.భూమిక, వి.అర్చన, కె.విజయలక్ష్మి, వి.అపర్ణ, కె.త్రిగుణ, కె.సిపోరా రాష్ట్ర స్థాయి జూనియర్‌ బాలికల కబడ్డీ జట్టుకు ఎంపికైనట్లు ఆయన తెలిపారు. ఈ నెల 20 నుంచి 23 వరకూ కర్నూలు జిల్లా నంద్యాలలో నిర్వహిస్తున్న 49వ ఆంధ్ర రాష్ట్ర అంతర జిల్లాల జూనియర్‌ బాలికల కబడ్డీ పోటీల్లో ఈ విద్యార్థులు పాల్గొనున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికైన విద్యార్థులకు గ్రామస్తులు, పూర్వ విద్యార్థుల అసోసియేషన్‌ సభ్యులు అభినందనలు తెలిపారు.

➡️