రాష్ట్రానికి తీరని ద్రోహం చేసిన బిజెపిని ఓడించండి : సిపిఎం

 వినుకొండ :  రాష్ట్రానికి తీరని ద్రోహం చేసిన బిజెపిని రానున్న ఎన్నికల్లో ప్రజలు ఓడిం చాలని సిపిఎం జిల్లా నాయకులు ఏపూరి గోపాలరావు సూచించారు. స్థానిక పుతుం బాక వెంకటపతి భవన్‌లో సోమవారం జరిగిన సిపిఎం జనరల్‌ బాడీ సమా వేశానికి పాలెపోగు ఆశీర్వాదం అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా గోపాల్‌ రావు మాట్లా డుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తానని, విభజన హామీలు అమలు చేస్తానని, రెవిన్యూ లోటు భర్తీ చేస్తానని ఇచ్చిన హామీలను అమలు చేయలేదని విమర్శించారు. రాష్ట్రానికి కీలకమైన పరిశ్రమ వేలాది మంది ఉపాధి పొందు తున్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేసేందుకు పూనుకోవడం దుర్మార్గ మన్నారు. రాష్ట్రానికి ద్రోహం చేసిన బిజెపితో అంటకాగుతున్న వైసిపి, టిడిప,ి జనసేన పార్టీలను కూడా ఓడిం చాలని కోరారు. దేశ సంప దను కార్పొరేట్‌ శక్తులకు అప్పగించి కొమ్ముకాస్తున్న బిజెపిని వ్యతిరేకిస్తూ ప్రజలు ఇండియా కూట మిని ఆదరిం చాలని పిలుపు నిచ్చారు. సమా వేశంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు కె.హను మంత్‌ రెడ్డి, సిపిఎం టౌన్‌ కార్యదర్శి బొంకూరు వెంకటేశ్వరరావు, నాసర్‌ బి, రంజాన్‌ బి పాల్గొన్నారు.

14న ‘చలో ఢిల్లీ’కి మద్దతు తెలపండి

రైతుల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ 540 రైతు సంఘాల ఆధ్వర్యంలో మార్చి 14వ తేదీ ఢిల్లీలో జరిగే భారీ బహిరంగ సభకు ప్రజలు మద్దతు తెలపాలని పల్నాడు జిల్లా రైతు సంఘం ప్రధాన కార్యదర్శి ఏపూరి గోపాలరావు కోరారు. సోమవారం స్థానిక పుతుంబాక వెంకటపతి భవన్‌లో కర పత్రాలను ఆవిష్కరిం చారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ స్వామి నాథన్‌ కమిటీ సిఫారసు ప్రకారం పంటలకు మద్దతు ధర చట్టం తేవాలని, మొదలైన డిమాండ్లు చేశారు. కనీస వేతనం 26,000 అమలు చేయా లని, ఉపాధి హామీకి కేంద్ర బడ్జెట్‌ లో రెండు లక్షల కోట్లు కేటాయించాలని మొదలైన డిమాండ్లు చేశారు. .కార్యక్రమంలో బి.వెంకటేశ్వరరావు, కె.హనుమంతరెడ్డి, నవీన్‌, నాసర్‌ బి, రంజాన్‌ బి, ఆశీర్వాదం, వెంకటేశ్వర్లు, ముని వెంక టేశ్వర్లు, వెంకటప్పయ్య తదితరులు పాల్గొన్నారు.

➡️