రాష్ట్ర స్థాయి ఫెన్సింగ్‌ పోటీలు ప్రారంభం

Dec 8,2023 20:35

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌  :  స్థానిక రాజీవ్‌ క్రీడా ప్రాంగణంలో మూడు రోజులుపాటు జరుగనున్న రాష్ట్ర స్థాయి జూనియర్‌ ఫెన్సింగ్‌ పోటీలను డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్రస్వామి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫెన్సింగ్‌ క్రీడకు పెరుగుతున్న ఆదరణ అభినందనీయమన్నారు. పాత కాలంలో కత్తి యుద్దమే నేడు ఫెన్సింగ్‌ క్రీడగా ప్రపంచంలో ఆదరణ పొందుతుందని అన్నారు. మన జిల్లాలో ఈ క్రీడను అభివృద్ధి చేయడంలో శిక్షకులు ప్రసాద్‌ చేసిన కృషి అభినందనీయమన్నారు. పోటీ తత్వంతో ఆడి మంచి ప్రతిభ కనబరిచి జాతీయ పోటీలకు ఎంపికై సత్తా చాటాలని కోరారు. మేయర్‌ వెంపడాపు విజయలక్ష్మి, కార్పొరేటర్‌ కంటుబుక్త తవిటి రాజు, వైసిపి నగర అధ్యక్షులు అశపు వేణు, సెట్విజ్‌ సిఇఒ రాంగోపాల్‌, చీఫ్‌ కోచ్‌, టోర్నమెంట్‌ నిర్వాహక కమిటీ కన్వీనర్‌ డివిచారి(ప్రసాద్‌), రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారులు పాల్గొన్నారు.

➡️