రిటైర్డ్‌ ఆర్మీ ఉద్యోగుల సమ్మేళనం

రిటైర్డ్‌ ఆర్మీ ఉద్యోగుల సమ్మేళనం

ప్రజాశక్తి -సామర్లకోట రూరల్‌ఆత్మీయ సమ్మేళనాల ద్వారా మన కుటుంబ సభ్యులకు భావి తరాలకు సైనికుల సేవలపై అవగాహన కలుగుతుందని పలువురు పేర్కొన్నారు. స్థానిక అన్నపూర్ణ కల్యాణ మండపంలో ఇండియన్‌ ఆర్మీ 201 ఇంజనీర్స్‌ రెజిమెంట్‌లో రిటైర్డ్‌ ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం బిక్కిన పరమేశ్వర సత్యనారాయణ అధ్యక్షతన నిర్వహించారు. రాష్ట్రంలో తొలిసారిగా సామర్లకోటలోనే రిటైర్డ్‌ ఆర్టీ ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించినట్టు తెలిపారు. ఏటా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా భావితరాలకు మనం అందించిన సేవలపై అవగాహన కల్పించి ఉత్తేజపరచడానికి అవకాశం ఉంటుందని వక్తలు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు తమ సర్వీసుల్లో అందించిన సేవలను గుర్తు చేసుకుని జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెస్‌ రెడ్డి, తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఎపి, తెలంగాణ నుంచి రిటైర్డ్‌ ఉద్యోగులు కుటుంబ సమేతంగా హాజరయ్యారు.

➡️