రూ.కోటి విలువైన మొబైల్‌ ఫోన్లు రికవరీ

Nov 30,2023 21:39
స్వాధీనం చేసుకున్న మొబైల్‌ ఫోన్లు

రూ.కోటి విలువైన మొబైల్‌ ఫోన్లు రికవరీప్రజాశక్తి – తిరుపతి సిటి రెండు నెలల వ్యవధిలో మొబైల్‌ హంట్‌ ద్వారా కోటి ఎనిమిది లక్షల రూపాయల విలువైన 600 మొబైల్‌ ఫోన్లు రికవరీ చేసినట్లు తిరుపతి ఎస్‌పి పరమేశ్వర్‌రెడ్డి తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మొబైల్‌ హంట్‌ (వాట్సాప్‌ 9490617873) అప్లికేషన్‌ సేవల ద్వారా వచ్చిన ఫిర్యాదులపై గతంలో జిల్లా వ్యాప్తంగా సెల్‌ ఫోన్‌ పోగొట్టుకున్న బాధితులకు ఆరు విడదలలో 2 కోట్ల 93 లక్షల 40వేల విలువ గల 1630 సెల్‌ఫోన్లు రికవరీ చేసి బాధితులకు అందజేశామన్నారు. ప్రస్తుతం ఏడో విడతలో రెండు నెలల వ్యవధిలోనే 600 ఫోన్లు రికవరీ చేశామన్నారు. బస్‌స్టేషన్లలో, రైల్వేస్టేషన్‌ లాంటి రద్దీ ప్రాంతాల్లో మొబైల్‌ ఫోన్లు ఎక్కువగా చోరీకి గురవుతున్నట్లు తెలిపారు. సెల్‌ ఫోన్‌ రికవరీలో ప్రతిభ కనబరిచిన సైబర్‌ క్రైమ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఓ.రామచంద్రారెడ్డి, సైబర్‌ క్రైమ్‌ సిబ్బందికి జిల్లా ఎస్పీ ప్రశంసా పత్రాలు అందజేసి, అభినందించినారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పిలు వెంకట్రావు, విమల కుమారి, సైబర్‌ సెల్‌ సిఐ రామచంద్ర రెడ్డి పాల్గొన్నారు.స్వాధీనం చేసుకున్న మొబైల్‌ ఫోన్లు

➡️