రూ.150 కోట్లతో నియోజకవర్గ అభివృద్ధి

Mar 17,2024 21:39
ఫొటో : మాట్లాడుతున్న పసుపులేటి సుధాకర్‌

ఫొటో : మాట్లాడుతున్న పసుపులేటి సుధాకర్‌
రూ.150 కోట్లతో నియోజకవర్గ అభివృద్ధి
ప్రజాశక్తి-దగదర్తి : కావలి నియోజకవర్గం రూ.150కోట్లతో అభివృద్ధి చేస్తానని జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పసుపులేటి సుధాకర్‌ అన్నారు. ఆదివారం మండల పరిధిలోని దగదర్తిలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 10యేళ్లుగా నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టానని తెలిపారు. కావలిలో జరిగిన బహిరంగ సభలో మేనిఫెస్టోను విడుదల చేశామన్నారు. జరగబోయే ఎన్నికల్లో తనను గెలిపిస్తే మేనిఫెస్టోలో ఉన్న ప్రతి హామీని నెరవేరుస్తారన్నారు. మేనిఫెస్టోలో హామీలు నెరవేర్చకపోతే ఎవరైనా ప్రశ్నించి వచ్చానన్నారు. అంతేకాక అవసరమైతే క్రిమినల్‌ కేసులో పెట్టారా బాండ్‌ పేపర్‌ రాసి ఇస్తానని వారన్నారు. అనంతరం కార్యకర్తలు మాట్లాడుతూ నాయకుని గెలిపించుకొని నియోజకవర్గ అభివృద్ధి చేసినందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని వారు కోరారు. కార్యక్రమంలో కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️