రూ.30వేలు దాతృత్వం

Mar 2,2024 21:42
ఫొటో : ఆర్థికసాయం అందజేస్తున్న కంచి పరమేశ్వర్‌రెడ్డి

ఫొటో : ఆర్థికసాయం అందజేస్తున్న కంచి పరమేశ్వర్‌రెడ్డి
రూ.30వేలు దాతృత్వం
ప్రజాశక్తి ఆత్మకూరు అర్బన్‌ : ఆత్మకూరు పట్టణంలో ఇటీవల మృతి చెందిన ముగ్గురికి ఒక్కొక్కరికి రూ.10వేల వంతున శ్రీ సాంబశివ చారిటబుల్‌ ట్రస్ట్‌ అధినేత నిత్యాన్నదాత కంచి పరమేశ్వర్‌ రెడ్డి ఆధ్వర్యంలో దాతృత్వం చేశారు. ఆత్మకూరు మున్సిపల్‌ పరిధిలోని ఐదో వార్డులోని జెఆర్‌పేటలో ఇటీవల మృతి చెందిన ఇమ్మిడిశెట్టి జనార్థన్‌ కుటుంబ సభ్యులను నిత్యాన్నదాత కంచి పరమేశ్వర రెడ్డి పరామర్శించారు. ఆ కుటుంబానికి రూ.10వేలు ఆర్థికసాయం అందజేశారు. 19వ వార్డు పరిధిలోని కొత్త ఆదమ్మ ఇటీవల మృతి చెందారు. ఆ కుటుంబాన్ని పరామర్శించి రూ.10వేలు ఆర్థికసాయం అందజేశారు. 16వ వార్డు పరిధిలోని ముస్లీం వీధిలో ఇటీవల మృతి చెందిన ఖాజా రంతుల్లా కుటుంబానికి నిత్య అన్నదాత కంచిపరమేశ్వర్‌ రెడ్డి పరామర్శించారు. అనంతరం ఆ కుటుంబానికి రూ.10వేలు ఆర్థికసాయం అందజేశారు. నేటి నుండి పట్టణ ప్రజల ఉపయోగార్థం మూడు ఫ్రీజర్‌ బాక్సులు, ఎఎస్‌ పేట గ్రామస్తుల కోసం ఒక ఫ్రీజర్‌బాక్స్‌ మృతి చెందిన వారిని శ్మశాన వాటికకు తరలించేందుకు ఒక వైకుంఠ వాహనాన్ని శనివారం నుండే అందుబాటులోకి ఉంటుందని, ఈ కైలాస రథం ఉచితంగా ఇవ్వడం జరుగుతుందన్నారు. ఫ్రీజర్లు ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని, పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కంచి పరమేశ్వర్‌ రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో మెప్మా ఆర్‌పిలు రాహిసా బేగం, ఆఫ్రిన్‌లు, ట్రస్ట్‌ సభ్యులు రాంపల్లి ప్రసాద్‌ రెడ్డి, ఎఎంసి మాజీ చైర్మన్‌ కుడుముల సుధాకర్‌ రెడ్డి, రాంరెడ్డి అశోక్‌ రెడ్డి, ఇతర ట్రస్ట్‌ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

➡️