రూ.30 కోట్లతో ఎత్తిపోతల పనులు

బ్రహ్మసాగర్‌ ఎత్తిపోతల పనులు వేగవంతం చేస్తాం. రూ.46 కోట్లతో బ్రహ్మసాగర్‌ కెనాల్‌ గేట్ల మరమ్మతులు, ఎత్తిపోతల పనులను పూర్తి చేయడంపై దృష్టి సారించాం. 1.56 లక్షల పూర్తిస్థాయిలో ఆయ కట్టుకు నీరందించడమే ధ్యేయంగా ముందుకెళ్తున్నాం. ఇందులోభాగంగా కుడి, ఎడమ కాల్వల పనుల్ని వేగవంతం చేశాం. ఎడమ కాల్వ పనుల్లో పురోగతి కనిపిస్తోంది. జిబిఒ, ఒబిసి పనుల్లో కదలిక నేపథ్యంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. నంద్యాల-కడప జిల్లా సరిహద్దు ప్రాం తంలోని 98 కి.మీ నుంచి 108 కి.మీ వరకు కాల్వల పనుల్ని పూర్తి చేస్తే పూర్తిస్థాయిలో ఆయకట్టుకు నీరందించే అవకాశాలు ఉంటాయని పేర్కొంటున్న తెలుగుగంగ ప్రాజెక్ట్స్‌ సూపరింటెండింగ్‌ ఆఫీసర్‌ ఇ.వెంకటరామయ్యతో ముఖాముఖి… – ప్రజాశక్తి – కడప ప్రతినిధిఎత్తిపోతల వివరాలు తెలపండి? బ్రహ్మంసాగర్‌ ఎడమ కాల్వ నుంచి రూ.30 కోట్ల వ్యయంతో తనుకు వాగు దగ్గర నుంచి ఎత్తిపోతల పథకం పనులకు టెండర్లు పిలిచాం. ఇప్పటికే మెయిన్‌ఫైప్‌లైన్‌ పనులకు టెండర్ల ప్రక్రియను పూర్తి చేశాం. ఎత్తిపోతల పథకం పనుల కారణంగా కలసపాడు, కాశినాయన మండలాల్లోని ఎగువ ప్రాంతాలకు తాగు, సాగునీటిని అందించే అవకాశం ఉంది.సాగర్‌ నిల్వ సామర్థ్యం ఎంత?17 టిఎంసిల నిల్వ సామర్థ్యాన్ని కలిగి ఉంది. ప్రస్తుతం 5.8 టిఎంసిలు నిల్వ ఉంది. కుందూ-పెన్నా ఎత్తిపోతల పథకం పూర్తి చేస్తే ఆయకట్టు పూర్తిస్థాయిలో స్థిరీకరణకు అవకాశం ఉంటుంది.కెనాల్‌ లీకేజీ గురించి చెప్పండి? బ్రహ్మంసాగర్‌ కుడి, ఎడమ కాల్వల నుంచి నీరు లీకేజీ కొనసాగుతోంది. ఒక కెనాల్‌ గేజ్‌లకు మరమ్మతులకు గురికావడం, మరో కెనాల్‌లో డ్రమ్స్‌ల సర్దుబాటులో స్తబ్ధత కారణంగా లీకేజీ కొనసాగుతోంది. దీనిపై నాలుగుసార్లు టెండర్లు పిలిచాం. కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. దీంతో ఇటీవల తాత్కాలికంగా ఎల్‌ఎస్‌పి కాంట్రాక్టర్‌తో కదిలించే ప్రక్రియ చేపట్టాం. కొంతవరకు ఉపశమనం కనిపించింది. పూర్తిస్థాయిలో మరమ్మతులకు టెండర్లు పిలవడమైంది.సాగర్‌ ఆయకట్టు విస్తీర్ణమెంత? బ్రహ్మంసాగర్‌ కింద 1.56 లక్షల విస్తీర్ణం ఉంది. ఇందులో 40 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నాం. మిగిలిన ఆయకట్టు ఎస్‌ ఆర్‌-1, ఎస్‌ఆర్‌-2 రిజర్వాయర్లు, ఎడమ, కుడి కాల్వల పరిధిలో ఉంది. ఇందులో జిబిసి, ఓబిసి కెనాల్‌ ప్రాంతాల్లో పెండింగ్‌ పనుల్ని పూర్తి చేయ డంపై ఆధారపడి ఉంది.సాగర్‌ ఆయకట్టు వివరాలు తెలపండి? బద్వేల్‌, మైదుకూరు నియోజకవర్గాల పరిధిలోని 11 మండలాల్లో బ్రహ్మంసాగర్‌ ఆయకట్టు విస్తరించింది. మైదుకూరు నియోజకవర్గ పరిధిలోని మైదు కూరు, దువ్వూరు, ఖాజీపేట, బద్వేల్‌ నియోజకవర్గంలోని బద్వేల్‌, పోరుమామిళ్ల, కలసపాడు, బి.కోడూరు, గోపవరం, అట్లూరు మండలాలున్నాయి. పెండింగ్‌ పనుల పురోగతి ఎలా ఉంది? బ్రహ్మంసాగర్‌ కుడి, ఎడమ కాల్వల్లోని జిబిసి, ఓబిసి ప్రాంతా ల్లోని అక్కడక్కడా ఉన్న పెండింగ్‌ పనులు వేగవంతం చేశాం. ఇందులో భాగంగా ఓబిసి ప్రాంతాల్లోని పెండింగ్‌ పనుల్ని చేపట్టడానికి కాంట్రాక్టర్‌ ముందుకు రావడంతో పనులు పట్టాలకు ఎక్కించాం. జిబిసి కాంట్రాక్టర్‌ ముందుకెస్తే 50 వేల ఎకరాల ఆయ కట్టుకు నీరందించే అవకాశం ఉంది. ఇందులోభాగంగా జిబిసి కింద 20 వేల ఎకరాలు, ఓబిసి కెనాల్‌ ప్రా ంతంలో 10 వేల ఎకరాలు వెరసి 30 వేల ఎకరాల ఆయకట్టు అందుబాటులోకి రానుంది.లైనింగ్‌ పనుల పరిస్థితి ఏమిటి? బ్రహ్మంసాగర్‌ కుడి కాల్వ 15 కిలోమీటర్లు, ఎడమ కాల్వ 58 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. రూ.9.7 కోట్లతో ఎడమ కాల్వ లైనింగ్‌ పనుల్లో 50 శాతం పురోగతి కొనసాగుతోంది. నాలుగు దఫాలుగా పిలిచిన టెండర్లలో జెకె కన్స్‌ స్ట్రక్షన్‌ కంపెనీ కాంట్రాక్టును దక్కించుకుని పనులు చేపడుతోంది. రూ.10 కోట్లతో కుడి కాల్వ పనులు చేపట్టాల్సి ఉంది. ఇందులో 700 మీటర్ల అక్విడక్టు పనులు చేపడితే అట్లూరు మండలంలో ని ఆయకట్టుకు నీరందించే అవకాశం ఉంది. లీకేజీ మరమ్మతు ఎంతవరకు వచ్చింది? బ్రహ్మంసాగర్‌ లీకేజీ పనులకు రూ.57 కోట్లతో ప్రతిపాదనలు పంపించాం. లీకేజీ ప్రాంతాల్లో 36 ఫిల్లర్లను ఏర్పాటు చేయడమైంది. ఇక్కడి నుంచి ముందుకు వెళ్లడానికి పోలవరం అథారిటీ నిపుణుల నుంచి అందే సూచనలు, సలహాలను బట్టి ముందుకు వెళతాం. దీంతోపాటు మరో 100 మీటర్లలో చెమ్మ తగిలిన ప్రాంతాన్నీ గుర్తించడమైంది. గ్రౌటింగ్‌ ప్రక్రియ సహాయంతో చెమ్మను అరికట్టే ప్రయత్నాలు చేపట్టాల్సి ఉంది.కుందూ-పెన్నా లిఫ్టు పనుల గురించి చెప్పండి? కుందూ-పెన్నా ఎత్తిపోతల పనులు పురోగతిలో ఉన్నాయి. 56 ఎకరాల భూసేకరణ అనంతరం ఎత్తిపోతల పనులు ఊపందుకునే అవకాశం ఉంది. లిఫ్టు పనులను పూర్తి చేసిన అనంతరం ఎనిమిది టిఎంసి లను ఎత్తిపోసే అవకాశం ఉంది.సర్‌ప్లస్‌ గేట్‌ ఏర్పాటు ఎప్పుడు? బ్రహ్మంసాగర్‌ సరఫ్లస్‌ గేట్‌ సెంట్రల్‌ డిజైనింగ్‌ ఆఫీసర్స్‌ సర్వే చేసి ప్రతిపాదనలు పంపించాం. డ్రాయింగ్‌ సెక్షన్‌ నుంచి అఫ్రూవల్‌ లభించాల్సి ఉంది.

➡️