రూ.50 వేల విరాళం అందజేత

ప్రజాశక్తి-శింగరాయకొండ : పాకల గ్రామంలోని విక్టరీ విద్యాలయంలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ మండల సమావేశం ఆదివారం నిర్వ హించారు. పాకల కోటేశ్వరరావు అధ్యక్షతన నిర్వహించారు. మానవత శింగరాయకొండ మండల శాఖ అవసరం కోసం బాలాజీ నగర్‌ దగ్గర గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు గంజి సుబ్బారావు తమ కుమారుడు జ్ఞాపకార్థకంగా ఇచ్చిన స్థలంలో ప్రహరీ గోడ నిర్మాణానికి దాతలు మునగపాటి వెంకటరత్నం, మారెళ్ళ లక్ష్మినారాయణ, కొత్తూరు రంగనాయకులు, కాసుల రామమోహన్‌, కాసుల రామారావు రూ.50 వేల విరాళాన్ని అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్‌ బి.హరిబాబు మాట్లాడుతూ మానవత స్వచ్ఛంద సంస్థ ద్వారా అందిస్తున్నఉ సేవల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి కోటపాటి నారాయణ, ట్రెజరర్‌ మహంకాళి నరసింహారావు, ప్రముఖ న్యాయవాది బక్కముంతల వెంకటేశ్వర్లు, సర్పంచి సైకం చంద్రశేఖరరావు, శీలం సునీల్‌ కుమార్‌రెడ్డి, విశ్రాంత పీడీ నర్రా యలమంద, ద్వారం భాస్కర్‌, ప్రతాపరెడ్డి, బుర్లా సుధాకరరెడ్డి పాల్గొన్నారు.

➡️