రూ.6.63 కోట్ల ‘ఆసరా’ చెక్కులు పంపిణీ

పెదకూరపాడు: స్థానిక జిల్లా పరిషత్‌ హైస్కూల్‌ ఆవరణలో ఆదివారం వైఎస ్‌ఆర్‌ ఆసరా చెక్కులను ఎమ్మెల్యే నంబూరు శంకరరావు పంపిణీ చేశారు. పెదకూర పాడు మండలంలోని 730 డ్వాక్రా సం ఘాలకు రూ.6.63 కోట్ల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మంచి చేయాలన్న సం కల్పం ఉంటే ప్రజలకు మంచి జరుగు తుందని, నాలుగున్నరేళ్లలో ప్రజలకు మేలు చేయగలిగామన్నారు. కరోనా కష్ట కాలంలోనూ సంక్షేమ పథకాలు ఆప కుండా అమలు చేశామన్నారు. సీఎం జగన్‌ 2 లక్షలకు పైగా ఉద్యోగాలివ్వడమే కాకుండా సచివాలయ వ్యవస్థతో పౌర సేవలను గడప ముందుకే తెచ్చారన్నారు. రైతు భరోసా కేంద్రాలు, హెల్త్‌ సెంటర్లతో ప్రజా సంక్షేమానికి అసలైన అర్థం చెప్పా రన్నారు. పెదకూరపాడు నియోజక వర్గంలో గతంలో ఎన్నడూ జరిగిన అభి వృద్ధి ఈ నాలుగున్నరేళ్లలో జరి గింద న్నారు. సుమారు రూ.400 కోట్లతో అభి వృద్ధి పనులు చేశామన్నారు. నియో జకవర్గంలో అన్ని రోడ్లను బాగు చేశా నన్నారు. నియోజకవర్గ ప్రజల చిరకాల కోరిక ప్రకారం అమరావతి – బెల్లంకొండ డబుల్‌ లేన్‌ రోడ్డు పూర్తి చేస్తున్నామని, రూ.23 కోట్లతో నియోజకవర్గంలో ఆస్ప త్రులు నిర్మించామన్నారు. భవిష్యత్తులో పులిచింతల బ్యాక్‌ వాటర్‌ నుంచి క్రోసూరు, అచ్చంపేట, బెల్లంకొండ మండ లాల రైతులకు సాగునీరు అందించే ప్రాజెక్టు చేపట్టబోతున్నట్లు చెప్పారు.

➡️