రూ. 73.35 కోట్లతో అభివృద్ధి పనులు

Jan 27,2024 21:43
చెక్కు ఆవిష్కరిస్తున్న నాయకులు

చెక్కు ఆవిష్కరిస్తున్న నాయకులు
రూ. 73.35 కోట్లతో అభివృద్ధి పనులు
పజాశక్తి -పొదలకూరు : పొదలకూరు పంచాయతీలో అభివద్ధి పనులకు అగ్ర తాంబూలం వేశామని, ఈ ఐదేళ్ల కాలంలో సుమారు రూ. 74 కోట్లతో ప్రజలకు అవసరమైన అభివద్ధి పనులు పూర్తి చేశామని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్‌, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌ రెడ్డి పేర్కొన్నారు. శనివారం ఉదయం పొదలకూరులో 43.60 లక్షలతో నిర్మించిన గ్రామ సచివాలయ భవనాన్ని, రూ. 23.94 లక్షలతో నిర్మించిన రైతు భరోసా కేంద్రాన్ని వెరసి 67.54 లక్షల వ్యయంతో నిర్మించిన రెండు భవనాలను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పొదలకూరు వంటి పెద్ద పంచాయతీలో నేడు ప్రారంభించిన భవనాలతో కలుపుకొని పొదలకూరు పెద్ద పంచాయతీ పరిధిలో 4 సచివాలయం భవనాలు, 4 రైతు భరోసా కేంద్రాలు, 4 హెల్త్‌ క్లినిక్‌ భవనాలు నిర్మాణం పూర్తయ్యాయన్నారు. పొదలకూరు మండలంలో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టి పూర్తి చేశామన్నారు. సిమెంట్‌ రోడ్లు, సైడు కాలువలు, పాఠశాల భవనాలు, ప్రధాన రహదారులు, లేఅవుట్లు త్రాగునీరు, విద్యుదీకరణ వంటి కార్యక్రమాలను చేపట్టి, ఈ ఐదేళ్ల కాలంలో పొదలకూరు మండలంలో 73 కోట్ల 35 లక్షల 79 వేల రూపాయలను అభివద్ధి పనులకు ఖర్చు చేశామన్నారు. అనంతరం పొదల కూరు ఎంపిడిఒ కార్యాలయంలో వైఎస్‌ఆర్‌ అసరా 4వ విడత నగదు పంపిణీ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో మంత్రి మాట్లాడారు. దేశ,రాష్ట్ర చరిత్రలో ఎక్కడలేని విధంగా ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలు మహిళ లకు చెందే విధంగా నేరుగా వారి ఖాతాల్లో జమ చేస్తూ, ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అని తెలిపారు ముఖ్యమంత్రి ఈ నెల 23 వ తేదీన ఉరవకొండ బహిరంగ సభ నుంచి బటన్‌ నొక్కి ప్రారంభిం చారని తెలిపారు. రాష్ట్రంలో 7, 98,395 స్వయం సహాయక సంఘాలకు 4 విడతల్లో షుమారు 25,570 కోట్ల రూపాయలు జమ చేసామని వెల్లడించారు.జిల్లాలో 4 విడతల్లో 34443 పొదుపు సంఘాల్లోని 329846 మంది అక్కచెల్లెమ్మలకు రూ. 1074.39 కోట్ల నగదును బ్యాంకు ఖాతాలకు జమ చేశామన్నరు.సర్వేపల్లి నియోజక వర్గం లో 4,063 యస్‌.హెచ్‌.జి గ్రూపులకు షుమారు 122.37 కోట్లు జమ చేసామని మంత్రి కాకాణి వివరించారు.4వ విడత వైఎస్సార్‌ ఆసరా క్రింద పొదలకూరు మండలంలో 1076 స్వయం సహాయక గ్రుపుల్లోని 10,620 మంది మహిళల ఖాతాల్లో 33.10 కోట్లు జమ చేసామని అన్నారు. ప్రతి కుటుంబం వద్దకు వాలంటీర్లు వచ్చి వారికి ఏ పథకాలు వర్తిస్తాయో తెలియచెప్పి, వాటిని వారి ఖాతాల్లో నేరుగా జమ చేసే విధంగా చర్యలు చేపట్టామన్నారు. అదేవిధంగా పెన్షన్లను ఇచ్చిన మాట ప్రకారం 3,000 రూపాయలకు పెంచి అందిస్తున్నామన్నారు. జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, మత్సకార భరోసా, వైయస్సార్‌ చేయూత వంటి మరెన్నో పథకాలను సమర్థవంతంగా అమలు చేయడంలో సఫలీకతం అయినందుకు ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. పొదలకూరులో మహిళలు నాలుగో విడత ఆసరా పంపిణీ కార్యక్రమంలో భారీ బహిరంగ సభను తలపించే విధంగా పాల్గొన్నం దుకు మంత్రి కతజ్ఞతలు తెలిపారు. డిఆర్డిఏ పిడి సాంబశివరెడ్డి, తాసిల్దార్‌ వీర వసంత కుమార్‌, ఎంపీడీవో నగేష్‌ కుమారి, జడ్పిటిసి నిర్మలమ్మ, మండల ఉపాధ్యక్షులు చంద్రశేఖర్‌ రెడ్డి, ఎంపీటీసీ సోమా అరుణ, లక్ష్మీ కళ్యాణి, సర్పంచ్‌ మల్లికా చిట్టెమ్మ, ఉప సర్పంచ్‌ వాకాటి శ్రీనివాసులు రెడ్డి, జిల్లా మండల స్థాయి అధికార్లు,ప్రజా ప్రతినిధులు, పొదుపు మహిళలు ఉన్నారు.

➡️