రెడ్‌క్రాస్‌ సొసైటీ సబ్‌ బ్రాంచ్‌ ప్రారంభం

ప్రజాశక్తి-సంతనూతలపాడు: ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసైటీ సబ్‌ బ్రాంచ్‌ను స్టానిక ఎంపిడీఓ కార్యాలయంలో ఆదివారం ప్రారంభించారు. అనంతరం నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసైటీ బ్రాంచ్‌ చైర్మన్‌గా శనగల వెంకటరమణ, వైస్‌ చైర్మన్‌గా శిఘాకొల్లి ధనలక్ష్మిలను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమానికి ఎన్నికల పరిశీలకులుగా ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ జిల్లా మేనేజింగ్‌ కమిటీ సభ్యులు బీవీ రెడ్డి వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాష్ట్ర ట్రెజరర్‌, జిల్లా వైస్‌ ప్రెసిడెంట్‌ సివి వెంకటేశ్వరరెడ్డి, స్టానిక తహశీల్దారు పిన్నిక మధుసూదనరావు, జిల్లా ఎగ్జిక్యూటివ్‌ సభ్యులు శివం ఫౌండేషన్‌ ఫౌండర్‌ గొల్లపూడి శ్రీహరి, మండల పరిషత్‌ ఏఓ బిఎస్వి ప్రసాద్‌ పాల్గొన్నారు. కమిటీ సభ్యులుగా కే వెంకటేశ్వర్లు, ఎం మల్లికార్జున్‌, ఎస్‌ మల్లారెడ్డి, పి శ్రీనివాసరావు, సిహెచ్‌ రామ్‌గోపాల్‌ మార్పుడి పాపారావు (కార్యదర్శి) లను ఎన్నుకున్నారు. వక్తలు మాట్లాడుతూ సేవలు చేయడం మహా భాగ్యమని, ఇండియన్‌ ప్రెస్‌ సొసైటీ ఆధ్వర్యంలో స్వచ్ఛందంగా సేవలు అందించాలని పరిశీలకులు కోరారు. మూడు సంవత్సరాల పాటు నూతన కమిటీ బాగా పనిచేసి మంచిపేరు తెచ్చుకోవాలని కోరారు.

➡️