రేేపటి నుంచి ఇంటర్‌ పరీక్షలు

Feb 29,2024 21:21
రేేపటి నుంచి ఇంటర్‌ పరీక్షలు

ఇంటర్‌ విద్యార్థులు
రేేపటి నుంచి ఇంటర్‌ పరీక్షలు
ప్రజాశక్తి -పొదలకూరు మండలంలో ఇంటర్‌ పరీక్షల నిర్వహణకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. రేపటి నుంచి 15వ తేదీ వరకు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. అరగంట ముందే విద్యార్థులు ఆయా పరీక్షా కేంద్రాలకు రావాలని, ఒక నిమిషం ఆలస్య మైన లోపలికి ప్రవేశం ఉండదని అధికారులు సూచిస్తున్నారు. తాగునీరు, వైద్య సేవలు, విద్యుత్తు సరఫరాకు అంతరాయం లేకుండా చర్యలు తీసుకున్నారు. మాస్‌ కాపీయింగ్‌ జరగకుండా అన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.పొదలకూరు పట్టణంలో గేట్‌ సెంటర్‌ లోనున్న ప్రభుత్వ జూనియర్‌ కాలేజీ, శ్రీని వాసపురం లోనున్న కాకతీయ జూనియర్‌ కాలేజీల్లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో 263 మంది విద్యార్థులు కాకతీయ జూనియర్‌ కళాశాలలో 191 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమల్లో ఉంటుంది. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా బల్లలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రైవేటు పరీక్షా కేంద్రాలపై ప్రత్యేక నిఘా ఉంచుతున్నట్లు అది óకారులు స్పష్టం చేశారు. ప్రభుత్వ ,కాకతీయ జూనియర్‌ కళాశాలలో చీఫ్‌ సూపరింటెండెంట్లుగా కె లక్షీనారాయణ, బొలిగర్ల.దొరబాబు డిపార్టుమెంటల్‌ అధికారలుగా కల్పన, వెంకట కష్షయ్య విధుల్లో ఉంటారు.ప్రైవేటు కేంద్రమైన కాకతీయ కాలేజీలో కూడా ఇన్విజిలేటర్లు గా ప్రభుత్వ ఉపాధ్యాయులు ఉంటారు. అధికారులతో పాటు సిబ్బంది కేంద్రాల్లోకి సెల్‌ ఫోన్‌ తీసుకెళ్లడానికి వీల్లేదు. చీఫ్‌ సూపరింటెండెంట్‌ ఒక్కరికే కీప్యాడ్‌ ఫోన్‌ అనుమతిస్తారు. విద్యార్థులు ఎలక్ట్రానిక్‌ వస్తువులను లోపలికి తీసుకెళ్లకూడదని వారు వెల్లడించారు.

➡️