రైతులకు నష్టపరిహారం ఇవ్వాలి

ప్రజాశక్తి – కురుపాం : మిచౌంగ్‌ తుపాను కారణంగా వరి, పత్తి పంటలు నష్టపోయిన రైతులకు వెంటనే నష్ట పరిహారం ఇవ్వాలని టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి టి.జగదీశ్వరి డిమాండ్‌ చేశారు. మండలంలో ఉదయపురం పంచాయతీలో ముంపునకు గురైన వరి, పత్తి పంటలను బుధవారం టిడిపి నాయకులతో కలిసి ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అరుగాలం కష్టించి పండించిన పంట చేతికొచ్చే సమయంలో తుపాను రూపంలో తీవ్ర నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. వర్షపునీటిలో తడిసిన ధాన్యం మొలకలు వస్తాయని, పత్తి పూర్తిగా తడిసిపోయిందని రైతులు ఆందోళన చెందుతున్నారన్నారు. రైతులు, కౌలురైతులు పెట్టిన పెట్టుబడి రాక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో తెలుగు రైతు అరకు పార్లమెంట్‌ అధ్యక్షులు దేవకోట వెంకట నాయుడు, నియోజకవర్గ రైతు అధ్యక్షులు గురాన శ్రీరామ్మూర్తి, నియోజకవర్గ పరిశీలకులు ఆరేటి మహేష్‌ బాబు, ఎస్‌టి సెల్‌ అధికార ప్రతినిధి నందివాడ కృష్ణబాబు, ట్రైబల్‌ రైట్స్‌ ఫోరం అధ్యక్షులు రొబ్బ లోవరాజు పాల్గొన్నారు.గుమ్మలక్ష్మీపురం : జియ్యమ్మవలస మండలంలోని చినకుదమ, పెద్ద బుడ్డిడి గ్రామాల్లో వర్షాలతో నష్టం వాటిల్లిన వరి, పత్తి పంటలను టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి తోయక జగదీశ్వరి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతు సంక్షేమ ప్రభుత్వమని గొప్పలు చెప్పుకుంటున్న వైసిపి రైతుల కష్టాలను కనీసం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. కార్యక్రమంలో తెలుగు రైతు నియోజకవర్గ అధ్యక్షులు గురాన శ్రీరామ్మూర్తి, ఎస్‌టి సెల్‌ అరకు పార్లమెంట్‌ అధికార ప్రతినిధి నందివాడ కృష్ణబాబు, నాయకులు దేవకోట వెంకటనాయుడు, రోబ్బ లోవరాజు, రేవళ్ల సీతారాం నాయుడు, కర్రి మన్మథరావు, కర్రి సత్యాలు, పొగరి రమేష్‌, రాజనాల రాజు, పాండు రంగారావు పాల్గొన్నారు.

➡️