రైతులకు నష్ట పరిహారం చెల్లించాలి: సిపిఎం

Dec 8,2023 20:50

ప్రజాశక్తి- కొమరాడ  :   మిచౌంగ్‌ తుపాను వల్ల నష్టపోయిన పత్తి, వరి, టమోటా రైతులను తక్షణమే ఆదుకోవాలని సిపిఎం నాయకులు కొల్లి సాంబమూర్తి డిమాండ్‌ చేశారు. శుక్రవారం ఆయన స్థానిక తహశీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ తుపాను వల్ల మండలంలోని వరి, టమోటా, పత్తి రైతులు బాగా నష్టపోయారన్నారు. అలాగే పత్తి నేలపాలై రాలిపోయే పరిస్థితి ఉందన్నారు. దీనివల్ల నేల పడిన పత్తి బురదలో కలిసిపోవడంతో తీవ్రంగా పత్తి రైతులకు నష్టం జరిగిందని తెలిపారు. కావున వెంటనే సంబంధిత అధికారులు రైతులు పండించిన పత్తిని పరిశీలించి రైతులకు నష్ట పరిహారం చెల్లించి అన్ని విధాలా కోరారు. అలాగే వరి కూడా కొంతవరకు నష్టం వాటిల్లిందన్నారు. టమోటా తోటలు మబ్బులకు, వర్షానికి పాడైపోయిందని, టమోటా పళ్లు కుళ్ళిపోయి నేల పాలై పంట నష్టం జరిగే పరిస్థితి ఉందని కావున వెంటనే పత్తి, వరి, టమోటా రౖతులను ఆదుకోవాలని కోరారు.సాలూరు రూరల్‌ : మిచాంగ్‌ తుపానుకారణంగా పంట నష్టపోయిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎం.శ్రీనివాసరావు, కోరాడ ఈశ్వరరావు కోరారు. శుక్రవారం వారు మండలతహశీల్దార్‌ బాలమురళీకృష్ణకు వినతిపత్రం అందజేశారు. ఇటీవల కురిసిన వర్షాలకు వరి పంట పూర్తిగా దెబ్బతిన్నదని చెప్పారు. రంగు మారిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు. సమగ్ర సర్వే చేసి రైతులకు ఎకరాకు రూ.50వేలు చొప్పున పరిహారం చెల్లించాలని కోరారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు కోనేటి చినబాబు వున్నారు.

➡️